Skip to content

Husband గురించి బైబిల్ వచనాలు

71 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.

  2. విడిచిపెట్టబడి మనోవేదనకు గురైన భార్యను భర్త పిలిచినట్లు తిరస్కరించబడిన యవ్వనంలో ఉన్న భార్యను భర్త పిలిచినట్లు, యెహోవా నిన్ను తిరిగి పిలుస్తారు” అని నీ దేవుడు చెప్తున్నారు.

  3. నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, నేను నిన్ను నీతి, న్యాయంతో, మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను.

  4. నీవు యెహోవాను తెలుసుకునేలా, నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను.

  5. “ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు.

  6. ఆయన మీ ఇద్దరిని ఒకటి చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా! అలా ఒకటిగా చేయడం ఎందుకు? దేవుని మూలంగా వారికి సంతానం కలగాలని కదా! అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి, యవ్వనంలో పెండ్లాడిన మీ భార్యకు ద్రోహం చేయకండి.

  7. “పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు. కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి.

  8. భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి.

  9. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.

  10. సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

  11. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.

  12. క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,

  13. దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.

  14. అదే విధంగా భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించినట్లే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు.

  15. ఎవరూ కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించరు, ప్రతివారు దానిని పోషించి, కాపాడుకుంటారు, అదే విధంగా క్రీస్తు సంఘాన్ని పోషించి కాపాడుతున్నారు.

  16. ఎందుకంటే మనం ఆయన శరీరం యొక్క అవయవాలమై ఉన్నాము.

  17. “ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరం అవుతారు.”

  18. ఇది లోతైన మర్మం; అయితే నేను క్రీస్తు సంఘం గురించి చెప్తున్నాను.

  19. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీలో ప్రతీ పురుషుడు తనను తాను ప్రేమించుకొన్నట్లు తన భార్యను ప్రేమించాలి, అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

  20. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది.

  21. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.