Skip to content

Commerce గురించి బైబిల్ వచనాలు

82 వచనాలు · 64 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.

  2. అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు. వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు.

  3. ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది.

  4. ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.

  5. ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.

  6. ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.

  7. ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.

  8. వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”

  9. సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.

  10. ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.

  11. తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.

  12. వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”

  13. అయితే నీ వ్యాపారం విస్తరించి నీవు హింసతో నిండిపోయి పాపం చేశావు. కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను.

  14. నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.

  15. నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన, నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు. కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను. అది నిన్ను కాల్చివేస్తుంది, చూస్తున్న వారందరి ఎదుట నేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను.

  16. ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”

  17. అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి;

  18. ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.

  19. ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!

  20. ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది.

  21. కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి, ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు, కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.”

  22. ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.

  23. ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”

  24. భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.

  25. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు;