Skip to content

Animals గురించి బైబిల్ వచనాలు

136 వచనాలు · 25 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది, అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి.

  2. సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి.

  3. సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి; అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి.

  4. అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, సాయంకాలం వరకు వారు కష్టపడతారు.

  5. యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.

  6. అదిగో విశాలమైన, మహా సముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరాలు దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి.

  7. సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.

  8. వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,

  9. అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.

  10. చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి.

  11. చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.

  12. మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.

  13. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది.

  14. నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు.

  15. ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే.

  16. అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది.

  17. ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”

  18. ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.

  19. దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు.

  20. “నేను ఆ దేశంలోకి తెగులు పంపి రక్తపాతం జరిగేంతగా నా ఉగ్రత కుమ్మరించి మనుష్యులను పశువులను చంపినప్పుడు,

  21. నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు.

  22. “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది!

  23. తినడానికి మేత లేక పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి! మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి; గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.

  24. యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.

  25. కాలువలు ఎండిపోయాయి; అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసింది మీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.