కంటెంట్‌కు వెళ్లండి

Animals గురించి బైబిల్ వచనాలు: Clean and unclean

26 వచనాలు · 25 కోణాలు

"Animals" కోసం వెతకండి

Clean and unclean గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అసహ్యమైనదేది తినకూడదు.

  2. మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,

  3. జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు,

  4. చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.

  5. అయితే, నెమరువేసే జంతువు లేదా చీలిన డెక్కలు కలిగి ఉన్న ఒంటెలు, కుందేలు, పొట్టి కుందేలు లాంటివి మీరు తినకూడదు. అవి నెమరువేసేవైనా వాటికి చీలిన డెక్కలు లేవు; అవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.

  6. పంది కూడా అపవిత్రమైనది; దానికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు.

  7. నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

  8. రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.

  9. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు.

  10. కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

  11. ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,

  12. ప్రతి రకమైన కాకి,

  13. కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  14. పైడికంటే, గుడ్లగూబ, హంస,

  15. గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,

  16. సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.

  17. ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.

  18. ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.

  19. అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూశాడు.

  20. దానిలో నాలుగు కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు పక్షులు ఉన్నాయి.

  21. అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.”

  22. అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు.

  23. రెండవసారి ఆ స్వరం అతనితో, “దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు” అన్నది.

  24. వారు ప్రజలను పెళ్ళి చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నిటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు.

  25. కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కాబట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు.