కంటెంట్‌కు వెళ్లండి

Animals గురించి బైబిల్ వచనాలు: Habits of

10 వచనాలు · 25 కోణాలు

"Animals" కోసం వెతకండి

Habits of గురించి వచనాలు

  1. కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.

  2. భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.

  3. మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది, అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి.

  4. సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి.

  5. సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి; అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి.

  6. అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, సాయంకాలం వరకు వారు కష్టపడతారు.

  7. యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.

  8. అదిగో విశాలమైన, మహా సముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరాలు దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి.

  9. ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.

  10. దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు.