Skip to content

Animals గురించి బైబిల్ వచనాలు

136 వచనాలు · 25 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు యెహోవా వారి మధ్యకు విషసర్పాలను పంపారు; అవి ప్రజలను కాటు వేశాయి, చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.

  2. ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు.

  3. అసహ్యమైనదేది తినకూడదు.

  4. మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,

  5. జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు,

  6. చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.

  7. అయితే, నెమరువేసే జంతువు లేదా చీలిన డెక్కలు కలిగి ఉన్న ఒంటెలు, కుందేలు, పొట్టి కుందేలు లాంటివి మీరు తినకూడదు. అవి నెమరువేసేవైనా వాటికి చీలిన డెక్కలు లేవు; అవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.

  8. పంది కూడా అపవిత్రమైనది; దానికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు.

  9. నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

  10. రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.

  11. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు.

  12. కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

  13. ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,

  14. ప్రతి రకమైన కాకి,

  15. కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  16. పైడికంటే, గుడ్లగూబ, హంస,

  17. గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,

  18. సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.

  19. ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.

  20. ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.

  21. కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.

  22. భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.

  23. అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.

  24. పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.

  25. నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను, లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.