కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 34:4సుమారు క్రీ.పూ. 589

    “ ‘అయినప్పటికీ యూదా రాజైన సిద్కియా, యెహోవా నీకు చేసిన వాగ్దానాన్ని విను. నీ గురించి యెహోవా ఇలా అంటున్నారు: నీవు ఖడ్గంతో చంపబడవు;

  2. యిర్మీయా 34:5సుమారు క్రీ.పూ. 589

    నీవు సమాధానంగా చనిపోతావు. నీకు ముందుగా పాలించిన రాజులైన నీ పూర్వికుల గౌరవార్థం ప్రజలు సుగంధ ద్రవ్యాలను దహించినట్లే, వారు నీ కోసం కూడా సుగంధద్రవ్యాలు దహిస్తూ, “అయ్యో, యజమానుడా!” అని విలపిస్తారు. నాకు నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”

  3. యిర్మీయా 34:6సుమారు క్రీ.పూ. 589

    అప్పుడు యిర్మీయా ప్రవక్త యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు ఇదంతా చెప్పాడు.

  4. యిర్మీయా 34:7సుమారు క్రీ.పూ. 589

    ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద యూదాలోని ఇతర పట్టణాల మీద, లాకీషు, అజేకా మీదా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో మిగిలి ఉన్న కోట పట్టణాలు ఇవి మాత్రమే.

  5. యిర్మీయా 34:8సుమారు క్రీ.పూ. 589

    సిద్కియా రాజు యెరూషలేములోని ప్రజలందరితో బానిసలకు విడుదల ప్రకటించాలని ఒడంబడిక చేసుకున్న తర్వాత యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది.

  6. యిర్మీయా 34:9సుమారు క్రీ.పూ. 589

    ప్రతి ఒక్కరూ తమకు బానిసలుగా ఉన్న హెబ్రీయులైన మగవారిని, ఆడవారిని అందరిని విడిపించాలి; తోటి యూదులను ఎవరూ బానిసత్వంలో ఉంచకూడదు.

  7. యిర్మీయా 34:10సుమారు క్రీ.పూ. 589

    కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు.

  8. యిర్మీయా 34:11సుమారు క్రీ.పూ. 589

    అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.

  9. యిర్మీయా 34:12సుమారు క్రీ.పూ. 589

    అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది:

  10. యిర్మీయా 34:13సుమారు క్రీ.పూ. 589

    “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి, బానిస దేశం నుండి బయటకు రప్పించినప్పుడు వారితో నిబంధన చేసి నేను ఇలా అన్నాను,

  11. యిర్మీయా 34:14సుమారు క్రీ.పూ. 589

    ‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు.

  12. యిర్మీయా 34:15సుమారు క్రీ.పూ. 589

    ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు.

  13. యిర్మీయా 34:16సుమారు క్రీ.పూ. 589

    కాని ఇప్పుడు మీరు తిరగబడి నా పేరును అపవిత్రం చేశారు. మీలో ప్రతి ఒక్కరు మీ ఆడ, మగ బానిసలను వారు కోరుకున్న చోటికి వెళ్లగలిగేలా వారిని విడుదల చేశారు. కాని మీరు వారిని మళ్ళీ మీ బానిసలుగా ఉండాలని బలవంతం చేశారు.

  14. యిర్మీయా 34:17సుమారు క్రీ.పూ. 589

    “కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: మీరు నా మాట వినలేదు. మీరు మీ సొంత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించలేదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ‘స్వాతంత్ర్యాన్ని’ చాటిస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఖడ్గం, తెగులు కరువుతో చావడానికే మీకు ‘విడుదల.’ నేను మిమ్మల్ని భూలోక రాజ్యాలన్నిటికీ అసహ్యమైన వారిగా చేస్తాను.

  15. యిర్మీయా 34:18సుమారు క్రీ.పూ. 589

    నా ఒడంబడికను ఉల్లంఘించి, నా ముందే తాము చేసిన ఒడంబడికలోని నిబంధనలను నెరవేర్చని వారిని, దూడను రెండు ముక్కలు చేసి దాని మధ్య నడిచినవారిగా నేను చూస్తాను.

  16. యిర్మీయా 34:19సుమారు క్రీ.పూ. 589

    యూదా, యెరూషలేము నాయకులు, ఆస్థాన అధికారులు, యాజకులు, దేశ ప్రజలందరు దూడ ముక్కల మధ్య నడిచినవారు,

  17. యిర్మీయా 34:20సుమారు క్రీ.పూ. 589

    వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.

  18. యిర్మీయా 34:21సుమారు క్రీ.పూ. 589

    “నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.

  19. యిర్మీయా 34:22సుమారు క్రీ.పూ. 589

    నేను ఆదేశాన్ని జారీ చేయబోతున్నాను. వారిని ఈ పట్టణానికి తిరిగి తీసుకువస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని స్వాధీనం చేసుకుని దానిని కాల్చివేస్తారు. నేను యూదా పట్టణాలను ఎవరూ నివసించని విధంగా నాశనం చేస్తాను.”

  20. యిర్మీయా 35:1సుమారు క్రీ.పూ. 607

    యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలనలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది:

  21. యిర్మీయా 35:2సుమారు క్రీ.పూ. 607

    “రేకాబీయుల కుటుంబం దగ్గరకు వెళ్లి, వారిని యెహోవా మందిరంలోని ప్రక్క గదుల్లో ఒక దానిలోకి రమ్మని ఆహ్వానించి, త్రాగడానికి వారికి ద్రాక్షరసం ఇవ్వు.”

  22. యిర్మీయా 35:3సుమారు క్రీ.పూ. 607

    కాబట్టి నేను హబజ్జిన్యా మనుమడును యిర్మీయా కుమారుడునైన యాజన్యాను అతని సోదరులను అతని కుమారులందరిని అంటే రేకాబీయుల కుటుంబమంతటిని తీసుకురావడానికి వెళ్లాను.

  23. యిర్మీయా 35:4సుమారు క్రీ.పూ. 607

    నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది.

  24. యిర్మీయా 35:5సుమారు క్రీ.పూ. 607

    అప్పుడు నేను ద్రాక్షరసంతో నిండిన పాత్రలను, కొన్ని గిన్నెలను రేకాబీయుల ముందు ఉంచి, “కొంచెం ద్రాక్షరసం త్రాగండి” అని వారితో చెప్పాను.

  25. యిర్మీయా 35:6సుమారు క్రీ.పూ. 607

    అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు.