కంటెంట్‌కు వెళ్లండి

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దానియేలు 3:29సుమారు క్రీ.పూ. 580

    కాబట్టి ఏ దేశ ప్రజలైనా గాని, ఏ భాష ప్రజలైనా గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని దూషిస్తే వారు ముక్కలు చేయబడతారని, వారి ఇల్లు కూల్చివేయబడుతుందని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా మరి ఏ దేవుడు రక్షించలేడు.”

  2. దానియేలు 3:30సుమారు క్రీ.పూ. 580

    అప్పుడు రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో ఉన్నత స్థానాల్లో నియమించాడు.

  3. రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక!

  4. సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము.

  5. ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి,

  6. నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను.

  7. నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి.

  8. కాబట్టి ఆ కల భావం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నా ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.

  9. మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు.

  10. చివరికి, దానియేలు నా దగ్గరకు వచ్చాడు (నా దేవుని పేరైన బెల్తెషాజరు అని అతనికి పేరు పెట్టాను, ఎందుకంటే అతనిలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది) అతనికి నా కల చెప్పాను.

  11. నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు.

  12. నా పడకలో నేను పడుకుని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి: నేను చూడగా, భూమి మధ్యలో ఒక చెట్టు కనిపించింది, దాని ఎత్తు చాలా ఎక్కువ.

  13. ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది.

  14. దానికి అందమైన ఆకులు సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. అందరికి సరిపడా ఆహారం దాని మీద ఉంది. అడవి జంతువులు దాని నీడలో ఉన్నాయి, పక్షులు దాని కొమ్మల్లో నివసించాయి; ప్రతి జీవి దాని నుండి పోషించబడింది.

  15. “నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు నా దర్శనాలలో పరలోకం నుండి ఒక పరిశుద్ధుడు, ఒక దూత రావడం చూశాను.

  16. అతడు ఇలా బిగ్గరగా అన్నాడు: ‘ఈ చెట్టును నరికివేయండి, కొమ్మలను కత్తిరించండి; దాని ఆకులను తీసివేసి దాని పండ్లను చెదరగొట్టండి. దాని క్రిందనుండి జంతువులు, దాని కొమ్మల నుండి పక్షులు పారిపోవాలి.

  17. అయితే దాని మొద్దును దాని వేర్లను ఇనుముతో ఇత్తడితో కట్టి పొలంలోని గడ్డిలో నేలపై విడిచిపెట్టండి. “ ‘అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి, అతడు జంతువులతో, భూమిమీది మొక్కలతో నివసించాలి.

  18. అతనికి ఏడు కాలాలు గడిచేవరకు, అతనికి మానవ మనస్సుకు బదులు జంతువు మనస్సు ఉండాలి.

  19. “ ‘ఈ నిర్ణయం దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ఈ తీర్పును ప్రకటించారు, తద్వారా సర్వోన్నతుడు, సమస్త మానవ రాజ్యాల మీద ప్రభువని, ఆయన కోరుకున్న వారెవరికైన ఇస్తారని, ఆయన మనుష్యుల్లో అల్పులైనవారికి వాటి మీద అధికారమిస్తారని మనుషులంతా తెలుసుకుంటారు.’

  20. “బెల్తెషాజరూ, నెబుకద్నెజరు రాజునైన నాకు వచ్చిన కల ఇది. బెల్తెషాజరూ, దాని అర్థమేంటో నాకు చెప్పు, నా రాజ్యంలో ఏ జ్ఞాని దీని భావం చెప్పలేదు. అయితే పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు చెప్పగలవు” అని అన్నాడు.

  21. అప్పుడు దానియేలు (బెల్తెషాజరు అని కూడా పిలువబడ్డాడు) కొంత సమయం కలవరపడ్డాడు, అతని తలంపులు అతనికి భయం కలిగించాయి. అప్పుడు రాజు అన్నాడు, “బెల్తెషాజరూ, ఈ కలకు గాని దాని భావానికి కలవరపడవద్దు.” బెల్తెషాజరు జవాబిస్తూ అన్నాడు, “నా ప్రభువా, ఆ కల మీ శత్రువులకు, దాని అర్థం మీ విరోధులకు చెందితే ఎంత బాగుండేది!

  22. మీరు చూసిన చెట్టు పెద్దగా, బలంగా పెరుగుతూ, ఆకాశాన్ని తాకుతూ, లోకమంతట కనిపిస్తుంది,

  23. దాని ఆకులు అందంగా, ఫలాలు సమృద్ధిగా ఉంటూ, అందరికి ఆహారాన్ని ఇస్తూ, అడవి జంతువులకు ఆశ్రయాన్ని ఇస్తూ, పక్షులు గూళ్ళు కట్టుకునే స్థలం కలిగి ఉంది

  24. రాజా! ఆ చెట్టు మీరే! మీరు గొప్పగా, బలవంతునిగా అయ్యారు; మీ గొప్పతనం ఆకాశాన్ని తాకే అంతగా, మీ అధికారం భూదిగంతాల వరకు విస్తరించింది.

  25. “రాజా! పరలోకం నుండి పరిశుద్ధుడు, ఒక దేవదూత వచ్చి, ‘చెట్టును నరికి దానిని నాశనం చేయాలి, కాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డి మధ్యలో విడిచిపెట్టాలి, దాని వేర్లు భూమిలో ఉండాలి. అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి; అతడు ఏడు కాలాలు దాటే వరకు అడవి జంతువుల మధ్యలో నివసించాలి’ అని ప్రకటించడం మీరు చూశారు.