circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 1 తిమోతి 4:9సుమారు క్రీ.శ. 65
ఈ మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది.
- 1 తిమోతి 4:10సుమారు క్రీ.శ. 65
అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.
- 1 తిమోతి 4:11సుమారు క్రీ.శ. 65
ఈ విషయాలను ఆజ్ఞాపించి బోధించు.
- 1 తిమోతి 4:12సుమారు క్రీ.శ. 65
నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.
- 1 తిమోతి 4:13సుమారు క్రీ.శ. 65
నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో.
- 1 తిమోతి 4:14సుమారు క్రీ.శ. 65
సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.
- 1 తిమోతి 4:15సుమారు క్రీ.శ. 65
ఈ విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉండు; నీ అభివృద్ధి అందరికి స్పష్టంగా కనబడేలా నీవు వాటిని పూర్తిగా ఆచరించు.
- 1 తిమోతి 4:16సుమారు క్రీ.శ. 65
నీ జీవితాన్ని ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చేస్తే, నిన్ను నీ బోధలు వినేవారిని కూడా నీవు రక్షించుకుంటావు.
- 1 తిమోతి 5:1సుమారు క్రీ.శ. 65
వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి ప్రోత్సహించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,
- 1 తిమోతి 5:2సుమారు క్రీ.శ. 65
సంపూర్ణమైన పవిత్రతతో నీ కన్నా పెద్దవారైన స్త్రీలను తల్లులుగా, నీ కన్నా చిన్నవారైన స్త్రీలను చెల్లెళ్ళుగా చూడు.
- 1 తిమోతి 5:3సుమారు క్రీ.శ. 65
నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సరియైన గుర్తింపు ఇవ్వు.
- 1 తిమోతి 5:4సుమారు క్రీ.శ. 65
కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబంపట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది.
- 1 తిమోతి 5:5సుమారు క్రీ.శ. 65
నిజంగా ఒంటరియైన, అవసరంలో ఉన్న విధవరాలు దేవునిపై ఆధారపడి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ సహాయం కోసం దేవున్ని అడుగుతూ ఉంటుంది.
- 1 తిమోతి 5:6సుమారు క్రీ.శ. 65
తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే.
- 1 తిమోతి 5:7సుమారు క్రీ.శ. 65
ఎవరు కూడా నిందించబడకుండా ఉండడానికి ప్రజలకు ఈ సూచనలన్నింటిని చెప్పు.
- 1 తిమోతి 5:8సుమారు క్రీ.శ. 65
ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.
- 1 తిమోతి 5:9సుమారు క్రీ.శ. 65
ఏ విధవరాలినైనా విధవరాండ్రల జాబితాలో చేర్చాలంటే, ఆమె అరవై సంవత్సరాలుకు పైబడి, తన భర్తకు నమ్మకంగా ఉండి,
- 1 తిమోతి 5:10సుమారు క్రీ.శ. 65
తన మంచిపనుల బట్టి సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, అనగా పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పరిశుద్ధుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి.
- 1 తిమోతి 5:11సుమారు క్రీ.శ. 65
అయితే యవ్వన విధవరాండ్రను ఆ జాబితాలో చేర్చకూడదు. ఎందుకంటే, వారు మేము క్రీస్తు కొరకే జీవిస్తామని నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, తమ శారీరక వాంఛలకు లొంగిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
- 1 తిమోతి 5:12సుమారు క్రీ.శ. 65
ఈ విధంగా వారు దేవునితో చేసుకున్న తమ మొదటి ఒప్పందాన్ని నిలుపుకోలేక తమపైకి తామే తీర్పును తెచ్చుకుంటారు.
- 1 తిమోతి 5:13సుమారు క్రీ.శ. 65
అంతేకాక వారు సోమరులుగా ఇంటింటికి తిరుగుతూ అనవసరమైన ముచ్చట్లతో, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.
- 1 తిమోతి 5:14సుమారు క్రీ.శ. 65
కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు పెళ్ళి చేసుకుని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి.
- 1 తిమోతి 5:15సుమారు క్రీ.శ. 65
అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు.
- 1 తిమోతి 5:16సుమారు క్రీ.శ. 65
విశ్వాసురాలైన ఏ స్త్రీయైనా తన కుటుంబంలో ఉన్న విధవరాలి భారాన్ని సంఘంపై పెట్టకుండా, తానే అలాంటి వారికి సహాయపడుతూ ఉండాలి. అప్పుడు నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సంఘం సహాయం చేయ కలుగుతుంది.
- 1 తిమోతి 5:17సుమారు క్రీ.శ. 65
సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు.