కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 తిమోతి 5:18సుమారు క్రీ.శ. 65

    దీని గురించి లేఖనాల్లో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు, పనివాడు జీతానికి పాత్రుడు” అని వ్రాయబడి ఉన్నది.

  2. 1 తిమోతి 5:19సుమారు క్రీ.శ. 65

    సంఘపెద్దపై వచ్చిన నిందను ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు లేకుండా అంగీకరించకూడదు.

  3. 1 తిమోతి 5:20సుమారు క్రీ.శ. 65

    అయితే సంఘపెద్దలు ఎవరైనా పాపం చేస్తే, ఇతరులకు హెచ్చరికగా ఉండడానికి వారిని అందరి ముందు గద్దించు.

  4. 1 తిమోతి 5:21సుమారు క్రీ.శ. 65

    ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండ, ఎవరి పట్ల భేదం చూపకుండ నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని ఎదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఎన్నుకోబడిన దేవదూతల ఎదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.

  5. 1 తిమోతి 5:22సుమారు క్రీ.శ. 65

    ఎవరిపైనా చేతులను ఉంచడానికి తొందరపడకు, ఇతరుల పాపంలో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో.

  6. 1 తిమోతి 5:23సుమారు క్రీ.శ. 65

    నీకున్న కడుపునొప్పి, నీకు తరచుగా వచ్చే బలహీనతల కారణంగా కేవలం నీటిని మాత్రమే త్రాగకుండా కొంచెం ద్రాక్షారసాన్ని కూడా త్రాగు.

  7. 1 తిమోతి 5:24సుమారు క్రీ.శ. 65

    కొందరి పాపాలు ప్రజల ఎదుట స్పష్టంగా కనబడి, తీర్పు తీర్చబడే చోటికి వారి కన్నా ముందుగా చేరుకుంటున్నాయి; మరి కొందరి పాపాలు వారి వెనుక అనుసరిస్తున్నాయి.

  8. 1 తిమోతి 5:25సుమారు క్రీ.శ. 65

    అదే విధంగా, ఇప్పుడు కొందరు చేసిన మంచి పనులు స్పష్టంగా కనబడుతున్నాయి, అయితే ఇంకొందరు చేసిన మంచి పనులు ఇప్పుడు కనబడకపోయినా, అవి చాలా కాలం దాచబడి ఉండవు.

  9. 1 తిమోతి 6:1సుమారు క్రీ.శ. 65

    దేవుని నామాన్ని మేము చేసిన బోధలను ప్రజలు దూషించకుండ ఉండడానికి, దాసులుగా బానిసత్వపు కాడి క్రింద ఉన్న విశ్వాసులైన వారందరు తమ యజమానులను గౌరవించదగినవారిగా భావించాలి.

  10. 1 తిమోతి 6:2సుమారు క్రీ.శ. 65

    విశ్వాసులైన యజమానులను కలిగినవారు వారు తమ తోటి విశ్వాసులే కదా అని అగౌరవంగా ప్రవర్తించకూడదు. పైగా తోటి విశ్వాసులైన తమ యజమానులు తమకెంతో ప్రియమైనవారని, వారు తమ దాసుల క్షేమం కోసం నియమించబడినవారని, వారికి మరింత బాగా సేవలు చేయాలి. నీవు ఈ సంగతులు బోధించి విశ్వాసులను ప్రోత్సాహించాలి.

  11. 1 తిమోతి 6:3సుమారు క్రీ.శ. 65

    మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మంచి ఉపదేశాలకు మన దైవభక్తిని పెంచే బోధకు వ్యతిరేకమైన బోధను ఎవరైనా బోధిస్తే,

  12. 1 తిమోతి 6:4సుమారు క్రీ.శ. 65

    అలాంటివారు వివేకం లేనివారు అహంకారులు. అలాంటివారు, మాటల వలన కలిగే వివాదాలలో గొడవలలో అనవసరమైన ఆసక్తి కలిగి ఉంటారు. దాని ఫలితంగా అసూయలు, కలహాలు, ద్వేషపూరితమైన మాటలు, దుష్ట సందేహాలు కలుగుతాయి,

  13. 1 తిమోతి 6:5సుమారు క్రీ.శ. 65

    దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.

  14. 1 తిమోతి 6:6సుమారు క్రీ.శ. 65

    అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము.

  15. 1 తిమోతి 6:7సుమారు క్రీ.శ. 65

    మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, లోకం నుండి ఏమి తీసుకెళ్లలేము.

  16. 1 తిమోతి 6:8సుమారు క్రీ.శ. 65

    కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి.

  17. 1 తిమోతి 6:9సుమారు క్రీ.శ. 65

    అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.

  18. 1 తిమోతి 6:10సుమారు క్రీ.శ. 65

    డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి వేరు. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు.

  19. 1 తిమోతి 6:11సుమారు క్రీ.శ. 65

    అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.

  20. 1 తిమోతి 6:12సుమారు క్రీ.శ. 65

    విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.

  21. 1 తిమోతి 6:13సుమారు క్రీ.శ. 65

    అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని ఎదుట, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను.

  22. 1 తిమోతి 6:14సుమారు క్రీ.శ. 65

    నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు నిందగాని డాగుగాని లేకుండా ఈ ఆజ్ఞలకు లోబడు.

  23. 1 తిమోతి 6:15సుమారు క్రీ.శ. 65

    రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏకైక అధిపతిగా ఉన్న భాగ్యవంతుడైన దేవున్ని తగిన సమయంలో దేవుడు ప్రత్యక్షపరుస్తారు.

  24. 1 తిమోతి 6:16సుమారు క్రీ.శ. 65

    ఆయన ఒక్కడే మరణం లేనివాడు, ఆయన సమీపించలేనంత వెలుగులో నివసిస్తాడు, ఆయనను ఎవరూ ఎన్నడు చూడలేదు, ఎన్నడు చూడలేరు. అలాంటి దేవునికే ఘనత ప్రభావాలు నిరంతరం కలుగును గాక ఆమేన్.

  25. 1 తిమోతి 6:17సుమారు క్రీ.శ. 65

    ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచక, వారి సంతోషం కోసం కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చే దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.