circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఎఫెసీయులకు 5:2సుమారు క్రీ.శ. 64
క్రీస్తు మనల్ని ప్రేమించి, పరిమళ సువాసనగా మన కోసం తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొన్నట్లే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి.
- ఎఫెసీయులకు 5:3సుమారు క్రీ.శ. 64
లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు.
- ఎఫెసీయులకు 5:4సుమారు క్రీ.శ. 64
దేవుని పట్ల కృతజ్ఞతగల మాటలనే మాట్లాడండి, మీలో బూతు మాటలకు, మూర్ఖపు లేదా పోకిరి మాటలకు చోటు ఉండకూడదు.
- ఎఫెసీయులకు 5:5సుమారు క్రీ.శ. 64
వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు.
- ఎఫెసీయులకు 5:6సుమారు క్రీ.శ. 64
వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది.
- ఎఫెసీయులకు 5:7సుమారు క్రీ.శ. 64
కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి.
- ఎఫెసీయులకు 5:8సుమారు క్రీ.శ. 64
ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి,
- ఎఫెసీయులకు 5:9సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది.
- ఎఫెసీయులకు 5:10సుమారు క్రీ.శ. 64
కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి.
- ఎఫెసీయులకు 5:11సుమారు క్రీ.శ. 64
నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.
- ఎఫెసీయులకు 5:12సుమారు క్రీ.శ. 64
అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.
- ఎఫెసీయులకు 5:13సుమారు క్రీ.శ. 64
కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది.
- ఎఫెసీయులకు 5:14సుమారు క్రీ.శ. 64
అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు” అని వ్రాయబడింది.
- ఎఫెసీయులకు 5:15సుమారు క్రీ.శ. 64
చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి.
- ఎఫెసీయులకు 5:16సుమారు క్రీ.శ. 64
దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
- ఎఫెసీయులకు 5:17సుమారు క్రీ.శ. 64
కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.
- ఎఫెసీయులకు 5:18సుమారు క్రీ.శ. 64
మద్యంతో మత్తులు కాకండి, అది మిమ్మల్ని దుష్టత్వంలోనికి నడిపిస్తుంది. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి,
- ఎఫెసీయులకు 5:19సుమారు క్రీ.శ. 64
సంగీతములతో, కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలతో, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీ హృదయాలతో పాటలు పాడుతూ సంగీతంతో ప్రభువును గురించి కీర్తిస్తూ,
- ఎఫెసీయులకు 5:20సుమారు క్రీ.శ. 64
ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
- ఎఫెసీయులకు 5:21సుమారు క్రీ.శ. 64
క్రీస్తుపట్ల గల భయభక్తులతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి.
- ఎఫెసీయులకు 5:22సుమారు క్రీ.శ. 64
భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి.
- ఎఫెసీయులకు 5:23సుమారు క్రీ.శ. 64
క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.
- ఎఫెసీయులకు 5:24సుమారు క్రీ.శ. 64
సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
- ఎఫెసీయులకు 5:25సుమారు క్రీ.శ. 64
క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.
- ఎఫెసీయులకు 5:26సుమారు క్రీ.శ. 64
క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,