circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఎఫెసీయులకు 3:5సుమారు క్రీ.శ. 64
ఈ మర్మం, ఆత్మ వలన ఇప్పుడు దేవుని పరిశుద్ధ అపొస్తలులకు ప్రవక్తలకు తెలియపరచబడినట్లుగా ఇతర తరాలలోని వారికి తెలియపరచబడలేదు.
- ఎఫెసీయులకు 3:6సుమారు క్రీ.శ. 64
ఈ రహస్యం ఏంటంటే, సువార్త ద్వారా యూదేతరులు ఇశ్రాయేలుతో కలిసి వారసులు, ఒకే శరీరంలోని సభ్యులు, క్రీస్తు యేసులోని వాగ్దానంలో భాగస్వాములు.
- ఎఫెసీయులకు 3:7సుమారు క్రీ.శ. 64
దేవుడు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.
- ఎఫెసీయులకు 3:8సుమారు క్రీ.శ. 64
పరిశుద్ధులలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకున్నారు.
- ఎఫెసీయులకు 3:9సుమారు క్రీ.శ. 64
సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడి ఉన్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియజేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు.
- ఎఫెసీయులకు 3:10సుమారు క్రీ.శ. 64
దేవుని ఉద్దేశమేమిటంటే, సంఘం ద్వారా, దేవుని నానా విధాలైన జ్ఞానము వాయుమండలంలోని ప్రధానులకు అధికారులకు తెలియజేయబడాలి.
- ఎఫెసీయులకు 3:11సుమారు క్రీ.శ. 64
అందుకని దేవుడు తన నిత్య సంకల్పాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చారు.
- ఎఫెసీయులకు 3:12సుమారు క్రీ.శ. 64
ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.
- ఎఫెసీయులకు 3:13సుమారు క్రీ.శ. 64
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నేను పడిన శ్రమలను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు, అవి మీకు కీర్తి.
- ఎఫెసీయులకు 3:14సుమారు క్రీ.శ. 64
ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను,
- ఎఫెసీయులకు 3:15సుమారు క్రీ.శ. 64
పరలోకంలోను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయనను బట్టే కుటుంబమని పిలువబడుతుంది.
- ఎఫెసీయులకు 3:16సుమారు క్రీ.శ. 64
తన మహిమ సమృద్ధి నుండి ఆయన మిమ్మల్ని మీ అంతరంగంలో తన ఆత్మ ద్వారా శక్తితో బలపరచాలని,
- ఎఫెసీయులకు 3:17సుమారు క్రీ.శ. 64
అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని,
- ఎఫెసీయులకు 3:18సుమారు క్రీ.శ. 64
మీరు ప్రభువు యొక్క పరిశుద్ధ ప్రజలందరితో కలిసి శక్తిని పొంది, క్రీస్తు ప్రేమ ఎంత వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఉన్నదో గ్రహిస్తూ,
- ఎఫెసీయులకు 3:19సుమారు క్రీ.శ. 64
సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ దేవుని పరిపూర్ణతతో మీరు పూర్తిగా నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను.
- ఎఫెసీయులకు 3:20సుమారు క్రీ.శ. 64
మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి,
- ఎఫెసీయులకు 3:21సుమారు క్రీ.శ. 64
సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
- ఎఫెసీయులకు 4:1సుమారు క్రీ.శ. 64
మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.
- ఎఫెసీయులకు 4:2సుమారు క్రీ.శ. 64
ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి.
- ఎఫెసీయులకు 4:3సుమారు క్రీ.శ. 64
మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి.
- ఎఫెసీయులకు 4:4సుమారు క్రీ.శ. 64
శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు;
- ఎఫెసీయులకు 4:5సుమారు క్రీ.శ. 64
ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;
- ఎఫెసీయులకు 4:6సుమారు క్రీ.శ. 64
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కరే, ఆయనే అందరికి పైగా ఉన్నవారు, అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నారు.
- ఎఫెసీయులకు 4:7సుమారు క్రీ.శ. 64
అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది.
- ఎఫెసీయులకు 4:8సుమారు క్రీ.శ. 64
అందుకే, ఈ విధంగా చెప్పబడింది: “ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి, తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.”