కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 యోహాను 1:11సుమారు క్రీ.శ. 90

    వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.

  2. 2 యోహాను 1:12సుమారు క్రీ.శ. 90

    మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.

  3. 2 యోహాను 1:13సుమారు క్రీ.శ. 90

    దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు.

  4. 3 యోహాను 1:1సుమారు క్రీ.శ. 90

    పెద్దనైన నేను,

  5. 3 యోహాను 1:2సుమారు క్రీ.శ. 90

    ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.

  6. 3 యోహాను 1:3సుమారు క్రీ.శ. 90

    కొందరు విశ్వాసులు వచ్చి నీవు సత్యంలో ఎలా జీవిస్తున్నావో చెప్తూ, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యమిచ్చినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది.

  7. 3 యోహాను 1:4సుమారు క్రీ.శ. 90

    నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.

  8. 3 యోహాను 1:5సుమారు క్రీ.శ. 90

    ప్రియ మిత్రుడా, నీకు పరిచయం లేని సహోదరి సహోదరుల కోసం నీవు చేస్తున్నదాంట్లో నమ్మకంగా ఉన్నావు.

  9. 3 యోహాను 1:6సుమారు క్రీ.శ. 90

    నీ ప్రేమ గురించి వారు సంఘానికి చెప్పారు. దయచేసి దేవుని ఘనపరచే విధంగా వారిని వారి మార్గంలో పంపు.

  10. 3 యోహాను 1:7సుమారు క్రీ.శ. 90

    దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు.

  11. 3 యోహాను 1:8సుమారు క్రీ.శ. 90

    మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.

  12. 3 యోహాను 1:9సుమారు క్రీ.శ. 90

    నేను సంఘానికి వ్రాశాను, కాని మొదటి స్థానాన్ని ఆశించే దియొత్రెఫే మమ్మల్ని చేర్చుకోవడంలేదు.

  13. 3 యోహాను 1:10సుమారు క్రీ.శ. 90

    కాబట్టి నేను వచ్చినపుడు అతడు చేస్తున్న వాటిని వివరిస్తాను. అతడు మా గురించి అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు. దానితో తృప్తి చెందకుండా, ఇతర విశ్వాసులను చేర్చుకోవడానికి కూడా అంగీకరించడం లేదు. చేర్చుకోవాలనుకునే వారిని కూడ అతడు ఆపివేసి, వారిని సంఘం నుండి వెళ్లగొడుతున్నాడు.

  14. 3 యోహాను 1:11సుమారు క్రీ.శ. 90

    ప్రియ మిత్రుడా, చెడును కాక మంచిని మాత్రమే అనుసరించు. మంచి చేసేవారు దేవునికి చెందినవారు. చెడు చేసేవారు దేవుని చూడలేరు.

  15. 3 యోహాను 1:12సుమారు క్రీ.శ. 90

    దేమేత్రిని గురించి అందరు మంచిగా చెప్తున్నారు. సత్యం విషయంలో కూడ మంచి సాక్ష్యం ఉంది. మా సాక్ష్యం సత్యమని నీకు తెలుసు.

  16. 3 యోహాను 1:13సుమారు క్రీ.శ. 90

    నేను నీకు వ్రాయవలసినది ఎంతో ఉంది. కాని కలంతో సిరాతో వ్రాయాలని నాకు లేదు.

  17. 3 యోహాను 1:14సుమారు క్రీ.శ. 90

    త్వరలో నేను నీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా నీతో మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.

  18. యూదా 1:1సుమారు క్రీ.శ. 66

    యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా,

  19. యూదా 1:2సుమారు క్రీ.శ. 66

    కరుణ, శాంతి, ప్రేమ మీలో సమృద్ధిగా కలుగును గాక.

  20. యూదా 1:3సుమారు క్రీ.శ. 66

    ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కోసం మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను.

  21. యూదా 1:4సుమారు క్రీ.శ. 66

    ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.

  22. యూదా 1:5సుమారు క్రీ.శ. 66

    మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఈజిప్టు దేశం నుండి విడిపించారు, కాని తర్వాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేశారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను.

  23. యూదా 1:6సుమారు క్రీ.శ. 66

    తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తుచేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు.

  24. యూదా 1:7సుమారు క్రీ.శ. 66

    అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.

  25. యూదా 1:8సుమారు క్రీ.శ. 66

    అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు.