- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 1 యోహాను 4:3సుమారు క్రీ.శ. 90
అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చి ఉన్నది.
- 1 యోహాను 4:4సుమారు క్రీ.శ. 90
ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు.
- 1 యోహాను 4:5సుమారు క్రీ.శ. 90
వారు లోకానికి చెందినవారు కాబట్టి లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది.
- 1 యోహాను 4:6సుమారు క్రీ.శ. 90
కాని మనం దేవునికి చెందినవారం, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కాబట్టి సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనకు తెలుస్తుంది.
- 1 యోహాను 4:7సుమారు క్రీ.శ. 90
ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు.
- 1 యోహాను 4:8సుమారు క్రీ.శ. 90
దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు.
- 1 యోహాను 4:9సుమారు క్రీ.శ. 90
ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విధంగా దేవుడు మన మధ్య తన ప్రేమను చూపించారు.
- 1 యోహాను 4:10సుమారు క్రీ.శ. 90
మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే.
- 1 యోహాను 4:11సుమారు క్రీ.శ. 90
ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి.
- 1 యోహాను 4:12సుమారు క్రీ.శ. 90
దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.
- 1 యోహాను 4:13సుమారు క్రీ.శ. 90
మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.
- 1 యోహాను 4:14సుమారు క్రీ.శ. 90
లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం మేము చూశాం సాక్ష్యమిచ్చాము.
- 1 యోహాను 4:15సుమారు క్రీ.శ. 90
యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు.
- 1 యోహాను 4:16సుమారు క్రీ.శ. 90
దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.
- 1 యోహాను 4:17సుమారు క్రీ.శ. 90
తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.
- 1 యోహాను 4:18సుమారు క్రీ.శ. 90
ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.
- 1 యోహాను 4:19సుమారు క్రీ.శ. 90
ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము.
- 1 యోహాను 4:20సుమారు క్రీ.శ. 90
అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు.
- 1 యోహాను 4:21సుమారు క్రీ.శ. 90
కాబట్టి దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ.
- 1 యోహాను 5:1సుమారు క్రీ.శ. 90
యేసే క్రీస్తు అని విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన కుమారుని కూడా ప్రేమిస్తారు.
- 1 యోహాను 5:2సుమారు క్రీ.శ. 90
దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనం దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది.
- 1 యోహాను 5:3సుమారు క్రీ.శ. 90
నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు.
- 1 యోహాను 5:4సుమారు క్రీ.శ. 90
దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.
- 1 యోహాను 5:5సుమారు క్రీ.శ. 90
లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా.
- 1 యోహాను 5:6సుమారు క్రీ.శ. 90
నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే రాలేదు, కాని నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చారు. ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ సత్యము.