- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
Creation & The Fall
God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 4:21సుమారు క్రీ.పూ. 4003
అతని తమ్ముని పేరు యూబాలు, అతడు తంతి వాయిద్యాలు వాయించే వారికి మూలపురుషుడు.
- ఆదికాండము 4:22సుమారు క్రీ.పూ. 4003
సిల్లా కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది, అతని పేరు తూబల్-కయీను, అతడు అన్ని రకాల ఇత్తడి ఇనుప పనిముట్లు తయారుచేయడంలో నిపుణుడు. తూబల్-కయీను యొక్క సోదరి నయమా.
- ఆదికాండము 4:23సుమారు క్రీ.పూ. 4003
ఒక రోజు లెమెకు తన భార్యలతో, “ఆదా, సిల్లా నా మాట ఆలకించండి; లెమెకు భార్యలారా, నా పలుకులు వినండి. నాకు గాయం చేసినందుకు ఒక మనుష్యుని, నన్ను గాయపరిచినందుకు ఒక యువకుడిని చంపాను.
- ఆదికాండము 4:24సుమారు క్రీ.పూ. 4003
కయీనును చంపితే ఏడు రెట్లు శిక్ష పడితే, లెమెకును చంపితే డెబ్బై ఏడు రెట్లు” అని అన్నాడు.
- ఆదికాండము 4:25సుమారు క్రీ.పూ. 4003
ఆదాము తన భార్యను మరోసారి లైంగికంగా కలుసుకున్నప్పుడు, ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చి, “దేవుడు, కయీను చంపిన నా కుమారుడు హేబెలుకు బదులుగా మరొక శిశువునిచ్చారు” అని అతనికి షేతు అని పేరు పెట్టింది.
- ఆదికాండము 4:26సుమారు క్రీ.పూ. 3769
షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. అప్పటినుండి ప్రజలు యెహోవా నామంలో ప్రార్థించడం మొదలుపెట్టారు.
ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.
ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.
- ఆదికాండము 5:3సుమారు క్రీ.పూ. 3874
ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు.
- ఆదికాండము 5:4సుమారు క్రీ.పూ. 3874
షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 5:5సుమారు క్రీ.పూ. 3074
ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
- ఆదికాండము 5:6సుమారు క్రీ.పూ. 3769
షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు.
- ఆదికాండము 5:7సుమారు క్రీ.పూ. 3769
ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
- ఆదికాండము 5:8సుమారు క్రీ.పూ. 2962
షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
- ఆదికాండము 5:9సుమారు క్రీ.పూ. 3679
ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు.
- ఆదికాండము 5:10సుమారు క్రీ.పూ. 3679
కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
- ఆదికాండము 5:11సుమారు క్రీ.పూ. 2864
ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
- ఆదికాండము 5:12సుమారు క్రీ.పూ. 3609
కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.
- ఆదికాండము 5:13సుమారు క్రీ.పూ. 3609
మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 5:14సుమారు క్రీ.పూ. 2769
కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
- ఆదికాండము 5:15సుమారు క్రీ.పూ. 3544
మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు.
- ఆదికాండము 5:16సుమారు క్రీ.పూ. 3544
యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
- ఆదికాండము 5:17సుమారు క్రీ.పూ. 2714
మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
- ఆదికాండము 5:18సుమారు క్రీ.పూ. 3382
యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు.
- ఆదికాండము 5:19సుమారు క్రీ.పూ. 3382
హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.