- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Creation Era
Creation & The Fall
God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.
ఈ కాలపు వచనాలు
- ఆదికాండము 3:20సుమారు క్రీ.పూ. 4004
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి.
- ఆదికాండము 3:21సుమారు క్రీ.పూ. 4004
యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు.
- ఆదికాండము 3:22సుమారు క్రీ.పూ. 4004
అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు.
- ఆదికాండము 3:23సుమారు క్రీ.పూ. 4004
కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు.
- ఆదికాండము 3:24సుమారు క్రీ.పూ. 4004
దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.
- ఆదికాండము 4:1సుమారు క్రీ.పూ. 4003
అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది.
- ఆదికాండము 4:2సుమారు క్రీ.పూ. 4003
తర్వాత అతని సహోదరుడైన హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు.
- ఆదికాండము 4:3సుమారు క్రీ.పూ. 4003
కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు.
- ఆదికాండము 4:4సుమారు క్రీ.పూ. 4003
హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు.
- ఆదికాండము 4:5సుమారు క్రీ.పూ. 4003
కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు.
- ఆదికాండము 4:6సుమారు క్రీ.పూ. 4003
అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు?
- ఆదికాండము 4:7సుమారు క్రీ.పూ. 4003
నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి.”
- ఆదికాండము 4:8సుమారు క్రీ.పూ. 4003
ఒక రోజు కయీను తన తమ్మున్ని పిలిచి, “మనం పొలానికి వెళ్దాం” అని అన్నాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు.
- ఆదికాండము 4:9సుమారు క్రీ.పూ. 4003
అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు.
- ఆదికాండము 4:10సుమారు క్రీ.పూ. 4003
అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది.
- ఆదికాండము 4:11సుమారు క్రీ.పూ. 4003
ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు.
- ఆదికాండము 4:12సుమారు క్రీ.పూ. 4003
నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు.
- ఆదికాండము 4:13సుమారు క్రీ.పూ. 4003
కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది.
- ఆదికాండము 4:14సుమారు క్రీ.పూ. 4003
ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.
- ఆదికాండము 4:15సుమారు క్రీ.పూ. 4003
అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు.
- ఆదికాండము 4:16సుమారు క్రీ.పూ. 4003
కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో నివసించాడు.
- ఆదికాండము 4:17సుమారు క్రీ.పూ. 4003
కయీను తన భార్యను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై హనోకుకు జన్మనిచ్చింది. అప్పుడు కయీను ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, దానికి హనోకు అని తన కుమారుని పేరు పెట్టాడు.
- ఆదికాండము 4:18సుమారు క్రీ.పూ. 4003
హనోకుకు ఈరాదు పుట్టాడు, ఈరాదు మెహూయాయేలు తండ్రి, మెహూయాయేలు మెతూషాయేలుకు తండ్రి, మెతూషాయేలు లెమెకుకు తండ్రి.
- ఆదికాండము 4:19సుమారు క్రీ.పూ. 4003
లెమెకు ఇద్దరిని భార్యలుగా చేసుకున్నాడు, ఒకరు ఆదా ఇంకొకరు సిల్లా.
- ఆదికాండము 4:20సుమారు క్రీ.పూ. 4003
ఆదా యాబాలుకు జన్మనిచ్చింది; అతడు గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచేవారికి మూలపురుషుడు.