కంటెంట్‌కు వెళ్లండి

Creation Era

Creation & The Fall

God creates the heavens and earth, forming humanity in his image before sin enters the world.

138 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 5:20సుమారు క్రీ.పూ. 3382

    యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

  2. ఆదికాండము 5:21సుమారు క్రీ.పూ. 3317

    హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.

  3. ఆదికాండము 5:22సుమారు క్రీ.పూ. 3317

    మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  4. ఆదికాండము 5:23సుమారు క్రీ.పూ. 3017

    హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు.

  5. ఆదికాండము 5:24సుమారు క్రీ.పూ. 3017

    హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.

  6. ఆదికాండము 5:25సుమారు క్రీ.పూ. 3130

    మెతూషెల 187 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి లెమెకు పుట్టాడు.

  7. ఆదికాండము 5:26సుమారు క్రీ.పూ. 3130

    లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  8. ఆదికాండము 5:27సుమారు క్రీ.పూ. 2348

    మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

  9. ఆదికాండము 5:28సుమారు క్రీ.పూ. 2948

    లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు.

  10. ఆదికాండము 5:29సుమారు క్రీ.పూ. 2948

    అతనికి నోవహు అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు.

  11. ఆదికాండము 5:30సుమారు క్రీ.పూ. 2948

    నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  12. ఆదికాండము 5:31సుమారు క్రీ.పూ. 2353

    లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.

  13. ఆదికాండము 5:32సుమారు క్రీ.పూ. 2448

    నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.