కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ రోజున యెరూషలేముపై దాడి చేసే దేశాలన్నిటిని నాశనం చేయడానికి నేను బయలుదేరుతాను.

  2. “అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.

  3. ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది.

  4. “ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.

  5. యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు.

  6. ఆ రోజున ఆయన యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవకొండ మీద తన పాదాలు ఉంచగా ఒలీవకొండ తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, సగం కొండ ఉత్తరదిక్కుకు, మరో సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగి మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది.

  7. ఆ రోజున యెరూషలేములో నుండి జీవజలాలు బయలుదేరి వాటిలో సగం మృత సముద్రానికి తూర్పుగా మరో సగం మధ్యధరా సముద్రానికి పడమరగా ప్రవహిస్తాయి. వేసవికాలంలో చలికాలంలో కూడా ఇలాగే ప్రవహిస్తాయి.

  8. యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది.

  9. మనుష్యులు దానిలో నివసిస్తారు; ఇక ఎన్నడు అది నాశనం కాదు. యెరూషలేము క్షేమంగా ఉంటుంది.

  10. యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి.

  11. యూదా వారు కూడా యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న దేశాల నుండి విస్తారమైన బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు పోగు చేయబడతాయి.

  12. అప్పుడు యెరూషలేముపై దాడి చేసిన దేశాలన్నిటిలో మిగిలి ఉన్నవారంతా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి గుడారాల పండుగ ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వస్తారు.

  13. ఒకవేళ భూప్రజల కుటుంబాలలో ఎవరైనా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు రాకపోతే, వారికి వాన కురవదు.

  14. యెరూషలేములో, యూదాలో ఉన్న ప్రతి పాత్ర సైన్యాల యెహోవాకు ప్రతిష్ఠించబడతాయి, బలి అర్పించడానికి వచ్చే వారంతా ఆ పాత్రల్లో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వంట చేసుకుంటారు. ఆ రోజు ఏ కనానీయుడు సైన్యాల యెహోవా మందిరంలో ఉండడు.

  15. యూదా వారు నమ్మకద్రోహులయ్యారు, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములో అసహ్యమైన పనులు జరుగుతున్నాయి. యూదా వారు యెహోవా ప్రేమించే పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరచి ఇతర దేవతలను పూజించేవారి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు.

  16. గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్లు యూదా వారు యెరూషలేము నివాసులు చేసే అర్పణలు యెహోవాకు అంగీకారమవుతాయి.

  17. హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు తూర్పుదిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు.

  18. హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడును అతనితో పాటు యెరూషలేము వారంతా కలవరపడ్డారు.

  19. యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి,

  20. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతాల నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు.

  21. భూమి తోడని అనవద్దు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం; యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణం.

  22. అప్పుడు కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేము పట్టణం నుండి యేసు దగ్గరకు వచ్చి,

  23. అప్పటినుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు.

  24. యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో,

  25. “మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుడు ముఖ్య యాజకులకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి,