God
God ను ప్రస్తావించే వచనాలు
వారి బలం పోయిందని బానిసలు గాని స్వతంత్రులు గాని ఎవరు మిగలలేదని చూసి, యెహోవా తన ప్రజలకు తీర్పు తీరుస్తారు తన సేవకుల మీద జాలి పడతారు.
ఆయన ఇలా అంటున్నారు: “వారి దేవుళ్ళు ఎక్కడ, వారు ఆశ్రయంగా ఏర్పరచుకున్న బండ ఎక్కడ,
“చూడండి, నేనే ఏకైక దేవున్ని! నేను తప్ప మరో దేవుడు లేడు చంపేవాడను నేనే బ్రతికించేవాడను నేనే. గాయం చేసేది నేనే, బాగు చేసేది నేనే, నా చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు.
నేను ఆకాశం వైపు నా చేయి ఎత్తి రూఢిగా ప్రమాణం చేస్తున్నాను: నా శాశ్వత జీవం తోడని చెప్తున్న,
నేను నా మెరిసే ఖడ్గానికి పదును పెట్టి, నా చేయి న్యాయాన్ని పట్టుకున్నప్పుడు, నేను నా ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటాను నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
నా ఖడ్గం మాంసాన్ని తింటుండగా, నేను నా బాణాలను రక్తంతో మత్తెక్కేలా చేస్తాను: చంపబడినవారి రక్తం, బందీల రక్తంతో, శత్రు నాయకుల తలలను అవి తింటాయి.”
జనులారా, ఆయన ప్రజలతో కూడా సంతోషించండి, ఎందుకంటే ఆయన తన సేవకుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటారు; ఆయన తన శత్రువుల మీద పగతీర్చుకుంటారు తన దేశం కోసం తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు.
అదే రోజు యెహోవా మోషేతో మాట్లాడుతూ,
“యెరికోకు ఎదురుగా మోయాబులోని నెబో పర్వతానికి అబారీము పర్వతశ్రేణిలోకి వెళ్లి, నేను ఇశ్రాయేలీయులకు వారి సొంత స్వాస్థ్యంగా ఇస్తున్న కనాను దేశాన్ని చూడు.
అసలు ఇలా జరిగిందంటే, మీరు సీను ఎడారిలోని మెరీబా కాదేషు నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల ముందు మీరిద్దరూ నా పట్ల నమ్మకద్రోహం చేశారు, ఇశ్రాయేలీయుల ఎదుట మీరు నా పరిశుద్ధతను గౌరవించకపోవడము.
కాబట్టి, నీవు దూరం నుండి మాత్రమే దేశాన్ని చూస్తావు; నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న దేశంలో నీవు ప్రవేశించవు” అని అన్నారు.
దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.
అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.
నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు; పరిశుద్ధులందరు మీ చేతిలో ఉన్నారు. వారు మీ పాదాల దగ్గర వంగి, మీ నుండి ఉపదేశాన్ని పొందుకుంటారు,
ప్రజల నాయకులు, ఇశ్రాయేలు గోత్రాలతో పాటు సమావేశమైనప్పుడు ఆయన యెషూరూనుకు రాజుగా ఉన్నాడు.
యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”
లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.
అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.
అతడు యాకోబుకు నీ కట్టడలను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు, మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.
యెహోవా, అతని సేవను దీవించండి, అతని చేతి పనులను బట్టి సంతోషించండి. అతనికి వ్యతిరేకంగా లేచినవారిని కొట్టండి, అతని శత్రువులను తిరిగి లేవనంతగా కొట్టండి.”
బెన్యామీను గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవాకు ప్రియమైనవాడు ఆయనలో క్షేమంగా ఉండును గాక, ఎందుకంటే రోజంతా ఆయన రక్షణగా ఉంటారు, యెహోవా ప్రేమించేవాడు ఆయన భుజాల మధ్య ఉంటాడు.”
యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;
భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.
అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నాడు; నాయకుని భాగం అతని కోసం ఉంచబడుతుంది. ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు యెహోవా యొక్క నీతియుక్తమైన చిత్తాన్ని, ఇశ్రాయేలీయు గురించి ఆయన తీర్పులను, అతడు అమలుచేస్తాడు.”
నఫ్తాలి గురించి అతడు ఇలా అన్నాడు: “నఫ్తాలి యెహోవా దయతో తృప్తి చెంది ఆయన దీవెనలతో నింపబడ్డాడు; దక్షిణం నుండి సముద్రం వరకు అతడు స్వాధీనం చేసుకుంటాడు.”