కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

  2. మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి. లాభం మీద దురాశతో కాక మనస్సు పూర్వకంగా దాన్ని కాయండి;

  3. అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”

  4. దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.

  5. తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.

  6. నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సీల సహాయంతో ఈ కొద్ది మాటలు వ్రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని, ఇది దేవుని నిజమైన కృప మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాను. మీరు దీనిలో నిలిచి ఉండండి.

  7. యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు,

  8. మన ప్రభువైన యేసు యొక్క, దేవుని యొక్క జ్ఞానం ద్వారా మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక.

  9. ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనత మహిమను పొందినపుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను” అని మహత్తరమైన మహిమగల ఒక శబ్దం పలికింది.

  10. మేము ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆ శబ్దాన్ని మేము విన్నాము.

  11. ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.

  12. ఎందుకంటే, దేవదూతలు పాపం చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వారిని సంకెళ్లతో బంధించి, చీకటి గల పాతాళానికి పంపి తీర్పు దినం వరకు వారిని కాపలాలో ఉంచారు.

  13. అయితే, పూర్వకాలంలో దేవుని వాక్యం వలన ఆకాశాలు సృజింపబడ్డాయని, నీళ్ల నుండి నీళ్ల ద్వారా భూమి ఏర్పడిందని వారు ఉద్దేశపూర్వకంగా మరచిపోతారు.

  14. దేవుని రాకడ దినం కోసం అపేక్షతో కనిపెట్టండి. ఆ దినాన ఆకాశాలు అగ్నిచేత నశించిపోతాయి, మూలకాలు వేడికి కరిగిపోతాయి.

  15. ఆ జీవం ప్రత్యక్షమైంది; తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యజీవాన్ని మేము చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాము.

  16. తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము.

  17. మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు.

  18. నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు.

  19. అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము.

  20. తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

  21. ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది; మీరు దుష్టుని జయించారు; కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

  22. ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ వారిలో ఉండదు.

  23. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.

  24. ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి కాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు శాశ్వతంగా జీవిస్తారు.

  25. అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి.