కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు,

  2. మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.

  3. దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు.

  4. పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు.

  5. ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు.

  6. తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమైన నిష్కళంకమైన ధర్మం ఏంటంటే: అనాధలను, ఇబ్బందుల్లో ఉన్న విధవరాండ్రను సంరక్షించడం, లోక మాలిన్యం అంటకుండా తమను కాపాడుకోవడము.

  7. నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి.

  8. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా?

  9. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి.

  10. నెరవేరబడిన లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది” అనే లేఖనం నెరవేరింది. అలాగే అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు.

  11. ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము.

  12. వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు.

  13. అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని, దీనులకు దయ చూపిస్తారు” అని లేఖనం చెప్తుంది.

  14. కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు.

  15. దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.

  16. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు?

  17. తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు:

  18. మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు.

  19. చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది.

  20. ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి” అని వ్రాయబడి ఉంది.

  21. పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.

  22. మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.

  23. ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు.

  24. ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి.

  25. మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.