కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  2. తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

  3. నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

  4. ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.

  5. జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా?

  6. దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు. సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది.

  7. అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు.

  8. ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.

  9. అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు.

  10. ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు.

  11. దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.

  12. సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు.

  13. That your faith should not stand in the wisdom of men, but in the power of God.

  14. అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. అది ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కోసం దాచియుంచిన మర్మం.

  15. అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది.

  16. ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది.

  17. ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.

  18. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము.

  19. అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు.

  20. నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే.

  21. కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.

  22. కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.

  23. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి.

  24. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?

  25. ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడుచేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు.