God
God ను ప్రస్తావించే వచనాలు
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మీ పూర్వికులు నాకు కోపం పుట్టించినప్పుడు దయ చూపించకుండ నేను మీకు కీడు చేయాలని అనుకున్నట్టే” అని సైన్యాల యెహోవా అంటున్నారు,
“ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి.
ఒకరిపై ఒకరు కుట్ర చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడవద్దు. ఇవన్నీ నేను ద్వేషిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది.
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “అనేకమంది ప్రజలు ఎన్నో పట్టణాల నివాసులు ఇంకా వస్తారు,
ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు.
అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.”
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.”
ప్రవచనం: హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి వచ్చిన యెహోవా వాక్కు: మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు యెహోవా మీద ఉన్నాయి.
అయితే యెహోవా దాని సంపదలు తీసివేసి, సముద్రంలో ఉన్న దాని శక్తిని నాశనం చేస్తారు. అది అగ్నితో కాల్చబడుతుంది.
సంకరజాతి ప్రజలు అష్డోదును ఆక్రమిస్తారు, ఫిలిష్తీయుల గర్వాన్ని నేను అంతం చేస్తాను.
వారి నోటిలో నుండి రక్తాన్ని, వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను. వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై యూదాలో ఒక వంశంగా ఉంటారు. ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు.
నేను కళ్లారా చూస్తున్నాను కాబట్టి బాధించేవారు నా ప్రజలపై మరలా ఎన్నడూ దాడి చేయకుండా దోపిడి మూకలు నా మందిరం మీదికి రాకుండా కాపాడడానికి నేను దాని దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తాను.
నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.
నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.
నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి. నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.
నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.
అప్పుడు యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతారు; ఆయన బాణాలు మెరుపులా వస్తాయి. ప్రభువైన యెహోవా బాకా మోగిస్తూ దక్షిణపు తుఫాను గాలులతో ముందుకు సాగుతారు,
సైన్యాల యెహోవా వారిని కాపాడతారు. వారు నాశనం చేస్తూ వడిసెల రాళ్లతో గెలుస్తారు. వారు త్రాగి, ద్రాక్షారసాన్ని త్రాగినట్లుగా వారు గర్జిస్తారు; బలిపీఠం మూలల్లో చిలకరించడానికి ఉపయోగించే గిన్నెలా వారు నిండుగా ఉంటారు.
కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు. వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా ఆయన దేశంలో ఉంటారు.
ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!
వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.
“కాపరుల మీద నా కోపం రగులుకుంది, నేను నాయకులను శిక్షిస్తాను; సైన్యాల యెహోవా తన మందయైన యూదా ప్రజల మీద శ్రద్ధ చూపుతారు ఆయన వారిని గర్వించే యుద్ధ గుర్రాల్లా చేస్తారు.
వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.