కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “రండి! ఉత్తర దేశం నుండి తప్పించుకుని రండి, ఆకాశం నాలుగు దిక్కులకు వీచే గాలిలా నేను మిమ్మల్ని చెదరగొట్టాను” అని యెహోవా చెప్తున్నారు.

  2. సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మిమ్మల్ని ముట్టుకున్న వారు యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే అని తలంచి తనకు ఘనత కలిగేలా మహిమాన్వితుడు మిమ్మల్ని దోచుకున్న దేశాల మీదికి నన్ను పంపించారు.

  3. నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.

  4. “సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

  5. “ఆ రోజున అనేక దేశాలు యెహోవా దగ్గరకు చేరి నా ప్రజలవుతారు. నేను మీ మధ్య నివసిస్తాను, అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.

  6. పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.

  7. సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”

  8. అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు.

  9. అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.

  10. అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు.

  11. తర్వాత యెహోవా దూత యెహోషువకు ఈ ఆదేశం ఇచ్చాడు:

  12. “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు నాకు లోబడి జీవిస్తూ, నా మార్గాలను పాటిస్తే, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాల మీద అధికారం కలిగి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉన్న వారి మధ్యలో నేను నీకు స్థానం ఇస్తాను.

  13. “ ‘ప్రధాన యాజకుడవైన యెహోషువా! విను; నీవూ, నీ ఎదుట కూర్చుని ఉన్న నీ సహచరులు జరగబోయే వాటికి సూచనలుగా ఉన్నారు: చిగురు అనే నా సేవకుడిని నేను తీసుకురాబోతున్నాను.

  14. నేను యెహోషువ ఎదుట ఉంచిన రాతిని చూడండి. ఆ రాయికి ఏడు కళ్లు ఉన్నాయి, నేను దాని మీద ఒక శాసనం చెక్కుతాను, ఒకే రోజులోనే నేను ఈ దేశపు పాపాన్ని తొలగిస్తాను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  15. “ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”

  16. అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, “జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  17. తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరకు ఇలా వచ్చింది:

  18. “జెరుబ్బాబెలు చేతులు ఈ ఆలయపు పునాదిని వేశాయి; అంతే కాకుండా అతని చేతులే దానిని ముగిస్తాయి. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు.

  19. “చిన్న విషయాలు జరిగే రోజును తృణకీరించే ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి అంతా సంచరించే యెహోవా యొక్క ఏడు కళ్లు జెరుబ్బాబెలు చేతిలోని మట్టపు గుండును చూసి సంతోషిస్తాయి.”

  20. అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు.

  21. సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”

  22. దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు.

  23. యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  24. అతనితో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘చిగురు అనే పేరుగల వ్యక్తి ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తూ, యెహోవా మందిరం కడతాడు.

  25. యెహోవా మందిరాన్ని కట్టేవాడు అతడే; అతడు వైభవాన్ని కలిగి సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు. అతడు తన సింహాసనం మీద యాజకునిగా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య సమాధానకరమైన ఆలోచన ఉంటుంది.’