కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.

  2. వారు పాతాళం లోతుల్లోనికి త్రవ్వుకొని వెళ్లినా, అక్కడినుండి నా చేయి వారిని తీసుకుంటుంది. వారు పైనున్న ఆకాశాల పైకి ఎక్కినా, అక్కడినుండి వారిని క్రిందికి తీసుకువస్తాను.

  3. వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను.

  4. శత్రువులు వారిని బందీలుగా దేశాంతరం తీసుకెళ్లినా, అక్కడ వారిని చంపమని ఖడ్గానికి ఆజ్ఞ ఇస్తాను. “నా చూపు వారి మీద నిలుపుతాను, అది కీడుకోసమే కాని మేలుకోసం కాదు.”

  5. సైన్యాల అధిపతియైన యెహోవా ఆయన భూమిని ముట్టగా అది కరిగిపోతుంది, భూనివాసులు అందరు విలపిస్తారు; దేశమంతా నైలు నదిలా పొంగుతుంది, ఈజిప్టు నదిలా అణగిపోతుంది.

  6. ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు, దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు. ఆయన సముద్రం నీటిని పిలిపించి భూమి మీద కుమ్మరిస్తారు, ఆయన పేరు యెహోవా.

  7. “ఇశ్రాయేలీయులైన మీరు నా దృష్టికి కూషు దేశస్థులతో సమానం కారా?” అని యెహోవా అంటున్నారు. “నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి, ఫిలిష్తీయులను కఫ్తోరు నుండి, అరామీయులను కీరు నుండి తీసుకురాలేదా?

  8. “నిజంగా ప్రభువైన యెహోవా కళ్లు పాపిష్ఠి రాజ్యం మీద ఉన్నాయి. నేను దాన్ని భూమి మీద ఉండకుండ నాశనం చేస్తాను. అయినా యాకోబు సంతానాన్ని సంపూర్ణంగా నాశనం చేయను,” అని యెహోవా అంటున్నారు.

  9. “నేను ఆజ్ఞ ఇస్తాను, మనిషి ధాన్యం జల్లెడలో వేసి, ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను.

  10. నా ప్రజల్లోని పాపులందరు ‘విపత్తు మనల్ని తరమదు, మన మీదికి రాదు’ అని అనుకునే వారందరు, ఖడ్గానికి గురై చస్తారు.

  11. “ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.

  12. అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.

  13. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు, నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు, నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి, అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది.

  14. నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను. “వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు. వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు; వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు.

  15. నేను ఇశ్రాయేలును తమ స్వదేశంలో నాటుతాను, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక ఎన్నడు పెళ్లగించబడరు,” అని మీ దేవుడైన యెహోవా చెప్తున్నారు.

  16. ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.

  17. “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు.

  18. నీవు గ్రద్దలా పైకి ఎగిరి, నక్షత్రాలలో నీ గూడు కట్టుకున్నా, అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

  19. “ఆ రోజున, యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, నేను ఎదోము జ్ఞానులను, ఏశావు పర్వతాల్లో వివేకులను నాశనం చేయనా?

  20. నా ప్రజలకు ఆపద సంభవించిన రోజున వారి గుమ్మాల్లో చొరబడకూడదు, వారికి ఆపద కలిగిన రోజున, వారికి వచ్చిన విపత్తును బట్టి సంతోషించకూడదు, వారికి ఆపద వచ్చిన రోజున వారి ఆస్తులను దోచుకోకూడదు.

  21. “యెహోవా దినం ఆసన్నమైంది, అది అన్ని దేశాల మీదికి వస్తుంది. నీవు చేసినట్టే, నీకు చేయబడుతుంది, నీ క్రియలు నీ తల మీదికి వస్తాయి;

  22. మీరు నా పవిత్ర కొండమీద త్రాగినట్టే, ఇతర ప్రజలందరు నిత్యం త్రాగుతారు; వారు ముందెన్నడూ త్రాగలేదన్నట్లు త్రాగుతూనే ఉంటారు.

  23. యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు.

  24. ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.

  25. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది: