కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బందీలుగా ఉన్న నీ ప్రజలు దగ్గరకు వెళ్లి వారు విన్నా వినకపోయినా, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే’ అని ప్రకటించు” అన్నారు.

  2. ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది.

  3. అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది.

  4. ఏడు రోజులు గడిచిన తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి:

  5. “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.

  6. నేను దుర్మార్గునితో, ‘నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, నీవు వాన్ని హెచ్చరించకపోయినా, లేదా వాని ప్రాణం కాపాడబడేలా చెడు మార్గాలను విడిచిపెట్టమని వాన్ని హెచ్చరించకపోయినా, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే, వాని చావుకు నిన్ను జవాబుదారీని చేస్తాను.

  7. “నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను.

  8. అప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చి, ఆయన నాతో, “నీవు లేచి, సమతల మైదాన ప్రాంతానికి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని అన్నారు.

  9. కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను.

  10. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను.

  11. కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు.

  12. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి.

  13. “నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను.

  14. నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను.

  15. నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.

  16. అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను.

  17. అందుకు ఆయన, “మంచిది, అలా అయితే మానవ మలం బదులు ఆవు పేడ మీద కాల్చడానికి నేను నిన్ను అనుమతిస్తాను” అని అన్నారు.

  18. ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపివేయబోతున్నాను. ప్రజలు ఆందోళనకు గురియై కొలత ప్రకారం ఆహారం తింటారు, అలాగే కొలత ప్రకారం నీరు త్రాగుతారు.

  19. నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను.

  20. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము ఇదే! దాని చుట్టూరా దేశాలున్నాయి.

  21. అయితే అది దాని చుట్టూ ఉన్న జాతుల కన్నా, రాజ్యాల కన్నా ఎక్కువగా నా ధర్మశాస్త్రాన్ని, శాసనాలను నిర్లక్ష్యం చేసింది. అది నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి నా శాసనాలను పాటించలేదు.

  22. “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరే దుష్టులు, నా శాసనాలను అనుసరించలేదు, నా చట్టాలను పాటించలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న జాతుల ప్రమాణాలకు కూడా మీరు అనుగుణంగా ఉండరు.

  23. “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను.

  24. మీ అసహ్యమైన విగ్రహాలన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది, ఇకపై ఎన్నడూ చేయనిది మీకు చేస్తాను.

  25. కాబట్టి మీ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తల్లిదండ్రులను తింటారు. నేను మీకు శిక్ష విధించి మీలో మిగిలిన వారినందరిని గాలికి చెదరగొడతాను.