కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు.

  2. దేశంలో ఖైదీలందరిని, కాళ్లక్రింద పడేసి త్రొక్కాలని,

  3. మహోన్నతుని ఎదుట, ప్రజలు తమ హక్కులను త్రోసిపుచ్చాలని,

  4. ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా?

  5. ప్రభువు శాసించనప్పుడు అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు?

  6. మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా?

  7. మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.

  8. మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి:

  9. “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు.

  10. “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు.

  11. ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.

  12. Till the LORD look down, and behold from heaven.

  13. యెహోవా, నీ నామమున మొరపెట్టాను, గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను.

  14. “మీరు నా మొరను ఆలకించారు, నీ చెవులు మూసుకోకు” అనే నా విన్నపాన్ని మీరు విన్నారు.

  15. నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి “భయపడకు” అన్నారు.

  16. ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు.

  17. యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి!

  18. యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు.

  19. యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు.

  20. వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, మీ శాపం వారి మీదికి వచ్చును గాక.

  21. కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి.

  22. యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది.

  23. యెహోవా తానే వారిని చెదరగొట్టారు; ఆయన ఇకపై వారిని పట్టించుకోరు. యాజకుల పట్ల ఇక గౌరవం చూపించరు, పెద్దల పట్ల దయ చూపించరు.

  24. యెహోవా అభిషిక్తుడు, మన ప్రాణానికి ఊపిరి. వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆయన నీడలో మనం ప్రజలమధ్య జీవిస్తాం అని అనుకున్నాము.

  25. సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.