కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది.

  2. మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.

  3. మోయాబు ప్రజలారా, భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. “భయాందోళన నుండి పారిపోయేవాడు గొయ్యిలో పడిపోతాడు, గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు ఉచ్చులో చిక్కుకుంటాడు; నేను మోయాబు మీదికి దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  5. “అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.

  6. అమ్మోనీయుల గురించి: యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఇశ్రాయేలుకు వారసుడు లేడా? మోలెకు గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?

  7. అయితే ఆ రోజులు రాబోతున్నాయి” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా నేను యుద్ధధ్వని చేసినప్పుడు; అది శిథిలాల దిబ్బ అవుతుంది, దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. అప్పుడు ఇశ్రాయేలు దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” అని యెహోవా అంటున్నారు.

  8. నీ చుట్టూ ఉన్న వారందరి నుండి నీకు భయం పుట్టిస్తాను” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. “మీలో ప్రతి ఒక్కరు తరిమివేయబడతారు, పారిపోయినవారిని ఎవరూ సమకూర్చరు.

  9. “అయితే, నేను అమ్మోనీయులను చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. ఎదోము గురించి: సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేమానులో ఇక జ్ఞానం లేదా? వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా? వారి జ్ఞానం తగ్గిపోయిందా?

  11. దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.

  12. అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను; అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను, అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు. అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు, అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి,

  13. ‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను. నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’ అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.”

  14. యెహోవా ఇలా అంటున్నారు: “పాత్రలోనిది త్రాగడానికి అర్హత లేనివారు కూడా దానిని త్రాగినప్పుడు మీరు శిక్షించబడకుండ ఎందుకు ఉండాలి? మీరు శిక్షించబడేలా దానిని మీరు త్రాగాలి.”

  15. యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.

  16. నేను యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది; “దానిపై దాడి చేయడానికి మీరంతా కలిసి రండి! లెండి! యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి, దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.

  17. “ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా, మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను.

  18. నీవు రేపిన భయాందోళనలు, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

  19. సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరూ నివసించనట్లే; ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.

  20. “యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”

  21. కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి, తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.

  22. పేరు పొందిన పట్టణం, నేను ఆనందించే పట్టణం ఎందుకు వదల్లేదు?

  23. నిశ్చయంగా, దాని యువకులు వీధుల్లో కూలిపోతారు; ఆ రోజున దాని సైనికులందరూ మూగబోతారు,” అని సైన్యాల యెహోవా ప్రకటించారు.

  24. “నేను దమస్కు గోడలకు నిప్పు పెడతాను; అది బెన్-హదదు కోటలను దహించివేస్తుంది.”

  25. బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి: యెహోవా ఇలా అంటున్నారు: “లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి తూర్పు ప్రజలను నాశనం చేయండి.