God
God ను ప్రస్తావించే వచనాలు
“ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’
నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది? నీ పాపాలు ఎక్కువగా ఉంటే, అది ఆయనకేమి చేస్తుంది?
నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు, నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు?
అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బోధించే, ఆకాశపక్షుల కన్నా మనలను జ్ఞానవంతులుగా చేసే, నా సృష్టికర్తయైన దేవుడు ఎక్కడున్నాడు?’ అని ఎవరు అనరు.
నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు; సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు.
అయితే, మీరు అతన్ని చూడలేదని, మీ వాదన అతని ముందు ఉందని, మీరు అతని కోసం వేచి ఉండాలని,
ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూ శిక్షించదు అతడు దుర్మార్గాన్ని కనీసం పట్టించుకోడు.
“ఇంకొంచెం సేపు నన్ను భరించండి దేవుని పక్షాన చెప్పాల్సింది చాలా ఉందని మీకు తెలియజేస్తాను.
నా మాటలు అబద్ధం కాదని నమ్మండి; పరిపూర్ణ జ్ఞాని మీతో ఉన్నాడు.
“దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు; ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు.
నీతిమంతులను ఆయన చూడకపోరు; వారిని రాజులతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టి నిత్యం వారిని ఘనపరుస్తారు.
వారు అహంకారంతో పాపం చేశారని ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు.
ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే, వారు తమ మిగిలిన రోజులు క్షేమంగా తమ సంవత్సరాలు సంతృప్తిగా గడుపుతారు.
“హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు; ఆయన వారిని బంధించినప్పుడు వారు సహాయం కోసం మొరపెట్టరు.
“ఆయన నిన్ను బాధల్లో నుండి తప్పించి పరిమితి లేని విశాలమైన ప్రదేశానికి, మంచి ఆహారంతో నిండిన బల్ల దగ్గరకు నిన్ను తీసుకువస్తారు.
ధనంతో ఎవరు నిన్ను మభ్యపెట్టకుండ జాగ్రత్తపడు; అధిక లంచం నిన్ను దారి తప్పించకుండ చూసుకో.
మీ సంపదలు మీ శక్తివంతమైన ప్రయత్నాలు బాధలో ఉండకుండా మిమ్మల్ని తప్పిస్తాయా?
“దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు. ఆయనలాంటి బోధకుడెవరు?
ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు, ‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు?
ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను ఘనపరచాలని నీవు జ్ఞాపకముంచుకో.
దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము! ఆయన సంవత్సరాలను లెక్కించలేనివి.
“అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు, అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది;
ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు?
ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి.
వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు సమృద్ధిగా ఆహారం ఇస్తారు.