కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను నా అత్యంత ఉత్పాదక సమయంలో ఉన్నాను, దేవుని సన్నిహిత స్నేహం నా ఇంటిని దీవించినప్పుడు,

  2. సర్వశక్తిమంతుడు ఇంకా నాతో ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు.

  3. “దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు; నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు.

  4. నా పట్ల మీరు కఠినంగా మారారు; మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు.

  5. నీవు నన్ను లాక్కుని గాలి ముందు నడిపిస్తావు; నీవు తుఫానులో నన్ను విసిరివేస్తావు.

  6. సజీవులందరి కోసం నియమించబడిన స్థలమైన, మరణానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు.

  7. “విరిగిన వ్యక్తి తన బాధలో సహాయం కోసం కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరూ చేయి వేయరు.

  8. పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం, ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి?

  9. ఆయన నా మార్గాలను చూడరా నా ప్రతి అడుగును లెక్కించరా?

  10. దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక, అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు.

  11. దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను? లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను?

  12. గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా? మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?

  13. దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి, ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.

  14. అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.

  15. “ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది! నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక; నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక.

  16. ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను, పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను.

  17. దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.

  18. అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.

  19. మాకు జ్ఞానం లభించింది; మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.

  20. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది; సర్వశక్తిమంతుని ఊపిరి నాకు జీవమిచ్చింది.

  21. దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే; నేను కూడా మట్టితో చేయబడ్డాను.

  22. అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు; నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు.

  23. నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు. నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’

  24. “కాని ఈ విషయంలో నీవు తప్పు, ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.

  25. ఒకని మాటలకు ఆయన స్పందించరని ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?