God
God ను ప్రస్తావించే వచనాలు
ప్రజలు తగ్గించబడినప్పుడు, ‘వారిని పైకి లేవనెత్తు!’ అని నీవు అంటావు అప్పుడు ఆయన దీనులను రక్షిస్తారు.
నేను ఆయన నివాసస్థలానికి వెళ్లగలిగేలా; ఆయన ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది కదా!
ఆయన ఎదుటే నా ఫిర్యాదేమిటో చెప్పుకుంటాను వాదోపవాదాలతో నా నోటిని నింపుకుంటాను.
ఆయన నాకు ఏమి జవాబు ఇస్తారో తెలుసుకుంటాను, ఆయన నాకు చెప్పేవాటిని గ్రహిస్తాను.
ఆయన తన మహాబలంతో నాతో వాదిస్తారా? లేదు, ఆయన నా మనవి వింటారు.
అక్కడ యథార్థవంతులు ఆయన ముందు వాదించగలరు, నేను నా న్యాయాధిపతి నుండి శాశ్వతంగా విడుదల పొందుతాను.
కాని నేను తూర్పుకు వెళ్లినా ఆయన అక్కడ లేరు; పడమరకు వెళ్లినా నేను ఆయన ఉన్నట్లు గ్రహించలేదు.
ఆయన ఉత్తరాన పని చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లినా నేను ఆయనను చూడలేదు; ఆయన దక్షిణ వైపుకు తిరిగినప్పుడు, నేనాయనను చూడలేదు.
కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.
ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.
ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను.
కాని ఆయన మారనివాడు, ఆయనను ఎవరు మార్చగలరు? తనకిష్టమైనదే ఆయన చేస్తారు.
నాకు వ్యతిరేకంగా తన శాసనాన్ని ఆయన కొనసాగిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి.
కాబట్టి నేను ఆయన ఎదుట భయపడుతున్నాను, వీటన్నిటిని ఆలోచించినప్పుడు నేను ఆయనకు భయపడుతున్నాను.
దేవుడే నా హృదయం క్రుంగిపోయేలా చేశారు; సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టారు.
చీకటి నన్ను చుట్టుముట్టినా, దట్టమైన చీకటి నా ముఖాన్ని కమ్మినా నేను నాశనమవ్వలేదు.
“సర్వశక్తిమంతుడు తీర్పుకాలాలను ఎందుకు నియమించరు? ఆయనను ఎరిగినవారు ఆ కాలాలను ఎందుకు చూడడం లేదు?
పట్టణంలో మరణమూలుగులు వినబడతాయి, గాయపడినవారి ప్రాణాలు సహాయం కోసం మొరపెడతారు. అయితే దేవుడు వారి మీద నేరారోపణ చేయడు.
భద్రతా భావనతో ఆయన వారిని విశ్రాంతి తీసుకోనిస్తారు, కాని వారి మార్గాలపై ఆయన దృష్టి ఉంచుతారు.
“అధికారం భీకరత్వం దేవునివే; ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.
ఆయన సైన్యాలు లెక్కించబడగలవా? ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు?
అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?
ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.
పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది; నరకం ఆయనకు తేటగా కనిపిస్తుంది.
ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.