కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.

  2. ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.

  3. ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.

  4. ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.

  5. ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”

  6. “నాకు న్యాయం నిరాకరించిన సజీవుడైన దేవుని మీద, నా జీవితాన్ని చేదుగా మార్చిన సర్వశక్తిమంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను,

  7. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నా నాసికా రంధ్రాల్లో దేవుని ఊపిరి ఉన్నంత వరకు,

  8. మీరు చెప్పేది సరియైనదంటే నేనొప్పుకోను; నేను చనిపోయే వరకు, నా నిజాయితీని విడిచిపెట్టను.

  9. భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత, దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది?

  10. వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా?

  11. సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా? అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా?

  12. “దేవుని శక్తిని గురించి నేను మీకు ఉపదేశిస్తాను; సర్వశక్తిమంతుని మార్గాలను నేను దాచిపెట్టను.

  13. “దుష్టులైన మనుష్యులకు దేవుడు ఇచ్చే భాగం; సర్వశక్తుని నుండి వారు పొందే వారసత్వం:

  14. వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.

  15. మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.

  16. బండలో వారు సొరంగం త్రవ్వుతారు. దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది.

  17. వారు నదుల మూలాలను శోధిస్తారు, మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు.

  18. దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు.

  19. ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు.

  20. ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు,

  21. వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు,

  22. అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు.

  23. అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.

  24. “గడచిన నెలల్లో ఉన్నట్లు, దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్లు నేను ఉంటే ఎంత బాగుండేది,

  25. ఆయన దీపం నా తలపై వెలిగినప్పుడు ఆయన వెలుగును బట్టి చీకటిలో నేను నడిచాను!