కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.

  2. వారు తమ కడుపు నింపుకునేప్పుడు, దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు, వారి మీద కష్టాలను కురిపిస్తారు.

  3. దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో, వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి.

  4. దుష్టులకు దేవుడు నియమించిన, వారసత్వం ఇదే.”

  5. వారి ఇళ్ళు భయం లేకుండ క్షేమంగా ఉన్నాయి; దేవుని శిక్షాదండం వారి మీదికి రాలేదు.

  6. అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.

  7. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  8. “అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది? దేవుడు తన కోపంలో కేటాయించిన, విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది?

  9. ‘దేవుడు దుష్టుల శిక్షను వారి పిల్లల కోసం దాచి ఉంచుతాడు’ అని చెప్పబడింది. వారు చేసిన దానిని వారే అనుభవించేలా, దుష్టులకు ఆయనను తిరిగి చెల్లించనివ్వండి.

  10. వారి కళ్లు వారి నాశనాన్ని చూడాలి; సర్వశక్తిమంతుని ఉగ్రత పాత్రను వారు త్రాగాలి.

  11. “అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు, అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా?

  12. “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?

  13. నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?

  14. “నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా? దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా?

  15. “దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!

  16. అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?

  17. ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.

  18. దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో!

  19. సర్వశక్తిమంతుడైన దేవుడు మాకేమి చేయగలడు?’ అంటారు కాబట్టి దుర్మార్గుల ప్రణాళికలకు నేను దూరంగా ఉంటాను.

  20. “దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు; దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది.

  21. ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.

  22. ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి

  23. అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.

  24. అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.

  25. నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.