కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు,

  2. నేను దానికి హద్దులను నిర్ణయించి తలుపులు గడియలు అమర్చినప్పుడు,

  3. వాటిని నేను కష్టకాలం కోసం, యుద్ధం కోసం యుద్ధ దినాల కోసం దాచిపెట్టాను.

  4. కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక తిరుగుతున్నప్పుడు కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు?

  5. బంజరు భూమిని దానికి ఇల్లుగా ఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను.

  6. ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.

  7. యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:

  8. “సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”

  9. అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:

  10. “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.

  11. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:

  12. “పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.

  13. “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?

  14. దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?

  15. అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.

  16. “నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.

  17. దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.

  18. దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?

  19. నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు? ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే.

  20. “లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి, దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను.

  21. అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు:

  22. “నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు.

  23. “మీరు అన్నారు, ‘నేను మాట్లాడతాను, నీవు విను; నేను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబివ్వాలి.’

  24. గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి.

  25. యెహోవా యోబుతో ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, “నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను.