కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి మీరంతా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసుకుని, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్లి మీ కోసం దహనబలిని అర్పించాలి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను అతని ప్రార్థన అంగీకరించి మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించను” అన్నారు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు.

  2. కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు; అప్పుడు యెహోవా యోబు ప్రార్థన అంగీకరించారు.

  3. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు.

  4. అప్పుడు అతని సోదరీ సోదరులందరు, గతంలో అతనికి పరిచయం ఉన్న ప్రతిఒక్కరు వచ్చి అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధ గురించి వారు దుఃఖపడి అతన్ని ఓదార్చారు. అంతేకాక ఒక్కొక్కరు ఒక వెండి నాణాన్ని, ఒక బంగారు ఉంగరాన్ని అతనికి ఇచ్చారు.

  5. యెహోవా యోబు జీవితాన్ని గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి.

  6. యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.

  7. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.

  8. యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,

  9. ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.

  10. ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,

  11. “నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”

  12. నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.

  13. నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.

  14. ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”

  15. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.

  16. దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు!

  17. “దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా

  18. కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.

  19. నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా

  20. నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.

  21. యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.

  22. రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా

  23. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.

  24. ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా

  25. యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.