కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే యెహోవా తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి మీద జాలిపడి దయ చూపారు. ఈనాటి వరకు యెహోవా వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టడానికి ఇష్టపడలేదు.

  2. అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు.

  3. అయితే అతడు ఆ హంతకుల సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.

  4. అతడు యెహోవా మందిరంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని తీసుకున్నాడు. అతడు బందీలను కూడా తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.

  5. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు.

  6. అతడు లెబో హమాతు నుండి మృత సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దులను మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమిత్తయి కుమారుడు, గాత్-హెఫెరు నివాసియైన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా పలికిన వాక్కు ప్రకారం ఇది జరిగింది.

  7. యెహోవా ఇశ్రాయేలులో అందరు అంటే బానిసలు స్వతంత్రులు ఎంత ఘోరంగా బాధ పడుతున్నారో చూశారు; వారికి సహాయం చేయడానికి ఎవరూ లేరు.

  8. ఇశ్రాయేలు పేరు ఆకాశం క్రింద లేకుండా తుడిచి వేస్తానని యెహోవా చెప్పలేదు, కాబట్టి వారిని యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా రక్షించాడు.

  9. అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.

  10. యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.

  11. అతడు తన పూర్వికులు చేసినట్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.

  12. కాబట్టి యెహోవా యెహుతో చెప్పిన ఈ మాట నెరవేర్చబడింది: “నీ సంతానం నాలుగు తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు.”

  13. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన ఏలుబడి అంతటిలో, ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.

  14. పెకహ్యా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.

  15. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.

  16. అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.

  17. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు.

  18. (ఆ రోజుల్లో యెహోవా యూదా మీదికి అరాము రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును పంపించడం మొదలుపెట్టారు.)

  19. ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు.

  20. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాల హేయక్రియలు చేసి, తన కుమారున్ని అగ్నిలో బలి ఇచ్చాడు.

  21. ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనం ఖజానాలో నుండి వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.

  22. యెహోవా సముఖంలో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని మందిరం ఎదుట నుండి అనగా తాను కట్టించిన నూతన బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య నుండి తీసి, నూతన బలిపీఠానికి ఉత్తర దిక్కున దానిని ఉంచాడు.

  23. మందిరం దగ్గర కట్టబడిన సబ్బాతు మంటపాలను, యెహోవా మందిరం బయట రాజు ద్వారాన్ని తీయించాడు. ఇది అష్షూరు రాజుకు భయపడి ఇదంతా చేశాడు.

  24. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అయితే తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల మాదిరిగా కాదు.

  25. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి రాజైన ఫరో బలం నుండి విడిపించి, వారిని బయటకు తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. వారు ఇతర దేవుళ్ళను పూజిస్తూ,