God
God ను ప్రస్తావించే వచనాలు
తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు;
యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.
ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది. అందుకు రాజు, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీ కుమారుని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అన్నాడు.
ఆ స్త్రీ ఇలా చెప్పింది, “మీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పని ఎందుకు చేశారు? రాజు ఇలా చెప్పినప్పుడు, బహిష్కరించబడిన తన కుమారున్ని రాజు తిరిగి తీసుకురాలేదు కాబట్టి తాను దోషి కావడం లేదా?
మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.
రాజు నా మనవి అంగీకరించి, దేవుడిచ్చిన వారసత్వాన్ని నేను, నా ఇద్దరు కుమారులు అనుభవించకుండ మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారి చేతిలో నుండి నన్ను విడిపించడానికి ఒప్పుకుంటాడు.’
“నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.
ప్రస్తుత పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడైన యోవాబు ఇలా చేశాడు. దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి నా ప్రభువుకు దేవుని దూతవంటి జ్ఞానం ఉన్నది” అన్నది.
ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము రాజు దగ్గరకు వెళ్లి, “నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన మ్రొక్కుబడిని తీర్చుకోనివ్వండి.
నీ సేవకుడు అరాములోని గెషూరులో ఉన్నప్పుడు, ‘ఒకవేళ యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకెళ్తే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను’ అని మ్రొక్కుబడి చేశాను” అని మనవి చేశాడు.
అందుకు ఇత్తయి రాజుతో, “నా ప్రభువైన రాజు ఎక్కడ ఉంటాడో నీ సేవకుడైన నేను మరణించినా బ్రతికినా అక్కడే ఉంటానని సజీవుడైన యెహోవా మీద, నా ప్రభువైన రాజు జీవం మీద ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.
సాదోకు అతనితో ఉన్న లేవీయులందరు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు. తర్వాత వారు మందసాన్ని క్రిందికి దించినప్పుడు ప్రజలందరూ పట్టణాన్ని దాటి వచ్చేవరకు అబ్యాతారు బలులు అర్పించాడు.
అప్పుడు రాజు సాదోకును పిలిచి, “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకెళ్లు. యెహోవా నా పట్ల దయ చూపిస్తే ఆయన నన్ను మరలా తీసుకువచ్చి ఆయన మందసాన్ని, ఆయన నివాస స్థలాన్ని నేను మళ్ళీ చూసేలా చేస్తారు.
ఒకవేళ ఆయన, ‘నీపై నాకు దయలేదు’ అని చెప్పినా సరే నేను అందుకు సిద్ధమే; ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే నా పట్ల అదే చేస్తారు” అని చెప్పాడు.
కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు.
ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.
ప్రజలు దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండమీద ఉండేది. దావీదు అక్కడికి చేరుకున్నప్పుడు అర్కీయుడైన హూషై తన పైవస్త్రాన్ని చింపుకుని తలమీద బూడిద పోసుకున్నాడు.
నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు.
అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.
తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి.
యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు.
అప్పుడు దావీదు స్నేహితుడు అర్కీయుడైన హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చి అతనితో, “రాజు చిరకాలం జీవించు గాక! రాజు చిరకాలం జీవించు గాక!” అన్నాడు.
అందుకు హూషై అబ్షాలోముతో, “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులందరు కలిసి ఎవరిని ఎంచుకుంటారో అతనికి చెందిన వాడనై అతనితోనే నేను ఉంటాను.
ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా సలహా చెప్తే అది దేవుని నుండి వచ్చిన మాటలా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలానే భావించేవారు.
అబ్షాలోము ఇశ్రాయేలీయులందరు అది విని, “అర్కీయుడైన హూషై చెప్పిన సలహా అహీతోపెలు చెప్పిన దానికంటే బాగుంది” అన్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి ఆపద రప్పించడానికి అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు.