కంటెంట్‌కు వెళ్లండి

Young Men గురించి బైబిల్ వచనాలు

347 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం; వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు.

  2. నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు.

  3. నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు, నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో.

  4. వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

  5. అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.

  6. నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.

  7. నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.

  8. నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.

  9. నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు. నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.

  10. నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు,

  11. అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు నీ పెదవులు తెలివిని కాపాడతాయి.

  12. వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, దాని నోరు నూనె కంటే నునుపైనది;

  13. కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.

  14. దాని పాదాలు మరణానికి దిగుతాయి; దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.

  15. అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు; దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు.

  16. నా కుమారులారా, నా మాట ఆలకించండి; నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.

  17. దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి, దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,

  18. పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు, మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.

  19. అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు.

  20. మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.

  21. అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి! నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!

  22. నేను నా బోధకులకు లోబడలేదు, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు.

  23. సర్వసమాజం మధ్య నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.”

  24. మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.

  25. మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా?