Skip to content

Young Men గురించి బైబిల్ వచనాలు

347 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు.

  2. నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు.

  3. హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.

  4. మూర్ఖులు యెహోవాకు అసహ్యులు కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.

  5. దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.

  6. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.

  7. జ్ఞానులు ఘనతను పొందుతారు, మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.

  8. నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.

  9. మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, కాబట్టి నా బోధను త్రోసివేయకండి.

  10. నేను కూడా నా తండ్రికి కుమారుడను, నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.

  11. నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే, “నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో; నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.

  12. జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో; నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.

  13. నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.

  14. జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.

  15. దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది; దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది.

  16. అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.”

  17. నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు, నీవు దీర్ఘకాలం జీవిస్తావు.

  18. నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను.

  19. నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు.

  20. ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.

  21. దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.

  22. దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.

  23. కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.

  24. వారు దుర్మార్గమనే ఆహారం తింటారు హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు.

  25. నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది.