కంటెంట్‌కు వెళ్లండి

The Sea గురించి బైబిల్ వచనాలు

95 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి, అయినా సముద్రం ఎప్పటికీ నిండదు. నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో అక్కడికే తిరిగి వెళ్తాయి.

  2. వారు ఆ రోజు సముద్ర ఘోషలా తమ శత్రువు మీద గర్జిస్తారు. ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది.

  3. నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.

  4. యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.

  5. తన చేతితో నీటిని కొలిచిన వారెవరు? జేనతో ఆకాశాన్ని కొలిచిన వారెవరు? భూమిలోని మట్టి అంతటిని బుట్టలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? తూనికతో కొండలను తూచిన వాడెవడు?

  6. నీవు నీళ్లను దాటుతున్నప్పుడు నేను నీతో ఉంటాను; నీవు నదులను దాటుతున్నప్పుడు అవి నిన్ను ముంచవు. నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.

  7. నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.

  8. నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు? నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు? నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా? నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా? కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను, నదులను ఎడారిగా చేస్తాను; నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి దాహంతో చస్తాయి.

  9. దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు. అది నెమ్మదిగా ఉండలేదు, దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి.

  10. మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.

  11. వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు కౄరమైనవారు, దయ చూపరు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు గర్జించే సముద్రంలా వినిపిస్తారు; సీయోను కుమారీ, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వరుసలో ఉన్న సైనికుల్లా వస్తారు.”

  12. షిబ్మా ద్రాక్షలారా, యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. మీ కొమ్మలు సముద్రం వరకు వ్యాపించాయి; అవి యాజెరు వరకు వ్యాపించాయి. నాశనం చేసేవాడు, పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.

  13. కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను.

  14. సముద్రం బబులోను మీదికి పొంగి వచ్చింది; ఎగసిపడే అలలు దాన్ని కప్పివేస్తాయి.

  15. యెరూషలేము కుమారీ! నీ గురించి ఏమి చెప్పగలను? నిన్ను దేనితో పోల్చగలను? సీయోను కుమారీ, కన్యకా! నిన్నెలా ఓదార్చడానికి నిన్ను దేనితో పోల్చగలను నీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉంది నిన్నెవరు స్వస్థపరచగలరు?

  16. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.

  17. వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను.

  18. ఇప్పుడు నీవు కూలిపోయిన రోజున తీరప్రాంతాలు కంపిస్తున్నాయి. నీవు పతనాన్ని చూసి సముద్ర ద్వీపాలు భయపడుతున్నాయి.’

  19. సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘తూరూ, నీవంటావు, “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”

  20. అతడు నాతో ఇలా అన్నాడు, “ఈ నీరు తూర్పు ప్రాంతం వైపు ప్రవహిస్తూ అరాబా లోకి వెళ్తుంది, అక్కడ అది మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అది సముద్రంలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ఉప్పునీరు మంచి నీటిగా మారుతుంది.

  21. అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.

  22. ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు; నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు. బాషాను కర్మెలు ఎండిపోతాయి, లెబానోను పువ్వులు వాడిపోతాయి.

  23. నైలు నది దగ్గర ఉండి, చుట్టూ నీళ్లు ఉన్న, తేబేసు కంటే మేలైనదానివా? ఆ నది ఆమెకు రక్షణ, ఆ నీళ్లు ఆమెకు గోడ.

  24. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా మహిమాన్విత జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.

  25. “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మరికొంత సమయంలో మరోసారి నేను ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని ఎండిన భూమిని కంపింపజేస్తాను.