Skip to content

The Ox గురించి బైబిల్ వచనాలు

111 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి; బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి.

  2. మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.

  3. దేవా! రెల్లు మధ్యలో ఉండే మృగాన్ని, అడవి జంతువుల లాంటి దేశాల మధ్యలో ఉన్న ఎడ్ల గుంపును గద్దించండి. అవి తగ్గించబడి వెండి కడ్డీలను పన్నుగా తెచ్చును గాక యుద్ధాలంటే ఇష్టపడే దేశాలను చెదరగొట్టండి.

  4. ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము.

  5. వారు మహిమగల దేవునికి బదులు తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు.

  6. మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి. గోడలు నాశనం కాకూడదు. చెరలోనికి వెళ్లకూడదు దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు.

  7. అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు,

  8. ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది; తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది.

  9. ఎద్దులు లేనిచోట, పశువుల దొడ్డి ఖాళీగా ఉంటుంది, కాని ఒక ఎద్దు బలం చేత విస్తారమైన పంట వస్తుంది.

  10. ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

  11. నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు;

  12. ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది, గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు, కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు, నా ప్రజలు గ్రహించరు.”

  13. గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి.

  14. ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.

  15. మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; వారిలో పారిపోయినవారు సోయరు వరకు, ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; హొరొనయీము వెళ్లే దారిలో తమ నాశనం గురించి విలపిస్తారు.

  16. భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి.

  17. మీరు ఎంతో ధన్యులై ఉంటారు, మీరు నీటి ప్రవాహాల ఒడ్డులన్నిటి దగ్గర మీ విత్తనాలు చల్లుతూ, మీ పశువులను గాడిదలను స్వేచ్ఛగా తిరగనిస్తారు.

  18. నీ పిల్లలు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుకున్నట్లు ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. యెహోవా ఉగ్రతతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.

  19. నన్ను వెదకే నా ప్రజల కోసం షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా, ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి.

  20. నేను వధకు దారితీసిన మృదువైన గొర్రెపిల్లలా ఉన్నాను; “చెట్టును, దాని పండ్లను నాశనం చేద్దాం; అతని పేరు ఇకపై జ్ఞాపకం రాకుండా ఉండేలా సజీవుల దేశం నుండి అతన్ని నరికివేద్దాము.”

  21. “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు.

  22. “ఈజిప్టు అందమైన పాడి ఆవు, అయితే దాని మీదికి ఉత్తరం నుండి జోరీగ వస్తున్నది.

  23. దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.

  24. “నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.

  25. “నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.