కంటెంట్‌కు వెళ్లండి

The Ox గురించి బైబిల్ వచనాలు

111 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు ప్రజల నుండి తరిమివేయబడి, అడవి జంతువుల మధ్య నివసిస్తారు; ఎద్దులా గడ్డి మేస్తూ ఆకాశపు మంచుకు తడిసిపోతారు. సర్వోన్నతుడు భూమిపై ఉన్న రాజ్యాలకు ప్రభువని, ఆయన వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తారని మీరు గుర్తించేవరకు మీకు ఏడు కాలాల వరకు ఇలా జరుగుతుంది.

  2. పొగరుబోతు పెయ్యలా ఇశ్రాయేలీయులు మొండిగా ఉన్నారు. అలాగైతే యెహోవా వారిని విశాల మైదానంలో గొర్రెపిల్లలను మేపినట్టు ఎలా పోషిస్తారు?

  3. ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.

  4. సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.

  5. మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.

  6. గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? కాని న్యాయాన్ని విషంగా మార్చారు, నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.

  7. అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా,

  8. “కాబట్టి ఆయన ఆహ్వానించిన వారి దగ్గరకు మరికొందరు పనివారిని పంపించి, ‘ఇదిగో, నేను విందు సిద్ధపరిచాను: నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెండ్లివిందుకు రండి’ అని చెప్పమన్నాడు.

  9. “మరొకడు, ‘నేనిప్పుడే అయిదు జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వాటిని చూడడానికి వెళ్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.

  10. మోషే ధర్మశాస్త్రంలో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు” అని వ్రాయబడి ఉంది. దేవుడు ఎద్దులను గురించి చెప్తున్నారా?

  11. ఖచ్చితంగా ఆయన మన కొరకే ఈ మాట చెప్పలేదా? అవును, ఇది ఖచ్చితంగా మన కొరకే వ్రాయబడింది, ఎందుకంటే పొలాన్ని దున్నేవారు, త్రొక్కేవారు పంటలో భాగం పొందాలనే ఆశతో పని చేయాలి.