Skip to content

The Ox గురించి బైబిల్ వచనాలు

111 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు.

  2. అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు.

  3. అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి.

  4. అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు.

  5. అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.

  6. తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు.

  7. అప్పుడు అబీమెలెకు గొర్రెలను, పశువులను, దాసదాసీలను అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాము భార్యయైన శారాను కూడా తిరిగి అప్పగించాడు.

  8. అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు.

  9. ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు.

  10. ముప్పై పాడి ఒంటెలు వాటి పిల్లలు, నలభై ఆవులు, పది ఎద్దులు, ఇరవై ఆడగాడిదలు, పది మగ గాడిదలు.

  11. నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి.

  12. వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి.

  13. ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే.

  14. ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి.

  15. యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు.

  16. అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు.

  17. మీరు చెప్పినట్లే మీ పశువులను గొర్రెలను తీసుకుని వెళ్లండి. అలాగే నన్ను దీవించండి” అని చెప్పాడు.

  18. మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”

  19. “ ‘నా కోసం మట్టితో బలిపీఠం తయారుచేసి దానిపై మీ దహనబలులను, సమాధానబలులను, మీ గొర్రెలను పశువులను అర్పించాలి. నేను ఎక్కడ నా పేరును ఘనపరచబడేలా చేసిన, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

  20. “ఒక ఎద్దు పురుషుని గాని స్త్రీని గాని చనిపోయేంతగా పొడిస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని మాంసం ఎవరూ తినకూడదు. కాని ఆ ఎద్దు యజమాని నిర్దోషి.

  21. అయితే ఎద్దుకు అంతకుముందే స్త్రీని గాని పురుషుని గాని పొడిచే అలవాటు ఉండి, దాని యజమానిని ఈ విషయంలో హెచ్చరించినా అతడు దానిని కట్టి అదుపులో పెట్టకపోవడం చేత ఆ ఎద్దు ఎవరినైనా చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని యజమానికి మరణశిక్ష విధించాలి.

  22. ఒకవేళ నష్టపరిహారం అడిగితే ఆ యజమాని ఆ నష్టపరిహారాన్ని చెల్లించి తన ప్రాణాన్ని విడిపించుకోవచ్చు.

  23. ఆ ఎద్దు కుమారుని గాని కుమార్తెను గాని పొడిచినా ఇదే నియమం వర్తించబడుతుంది.

  24. ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.

  25. “ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును గాయపరచగా అది చనిపోతే ఆ ఇద్దరు బ్రతికి ఉన్న ఎద్దును అమ్మగా వచ్చిన డబ్బును చచ్చిన ఎద్దును చెరిసగం పంచుకోవాలి.