కంటెంట్‌కు వెళ్లండి

The Ox గురించి బైబిల్ వచనాలు

111 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ ఎద్దుకు అంతకుముందే పొడిచే అలవాటు ఉంటే దాని యజమాని దానిని కట్టి అదుపులో పెట్టలేదు కాబట్టి అతడు ఖచ్చితంగా ఎద్దుకు బదులు ఎద్దు ఇవ్వాలి; చచ్చిన ఎద్దు అతనిది అవుతుంది.

  2. ఒకవేళ దొంగతనానికి గురియైన జంతువు ప్రాణంతో వారి స్వాధీనంలో కనబడితే, అది ఎద్దు గాని గాడిద గాని గొర్రెగాని దానికి రెండింతలు చెల్లించాలి.

  3. అన్యాయంగా సంపాదించిన ఎద్దు, గాడిద, గొర్రె, బట్ట వంటి వాటన్నిటి విషయంలో పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, ‘ఇది నాది’ అని చెప్తే వారిద్దరు దేవుని సమక్షానికి తమ సమస్యను తీసుకురావాలి. న్యాయాధికారులు నేరస్థునిగా నిర్ధారించినవాడు ఎదుటివానికి రెట్టింపు పరిహారం చెల్లించాలి.

  4. “ఒకరు తన గాడిదనైన ఎద్దునైన గొర్రెనైన కాపాడమని తన పొరుగువానికి ఇచ్చినప్పుడు అది చనిపోయినా లేదా గాయపడినా లేదా ఎవరూ చూడనప్పుడు దాన్ని ఎవరైనా తీసుకెళ్లినా,

  5. పొరుగువాడు ఆ వ్యక్తి ఆస్తి మీద చేతులు వేయలేదని యెహోవా ఎదుట ప్రమాణం చేయడం ద్వారా వారిద్దరి మధ్య సమస్య పరిష్కరించబడుతుంది. యజమాని దానికి అంగీకరించాలి; నష్టపరిహారం అవసరం లేదు.

  6. అతని దగ్గర నుండి ఆ జంతువు దొంగతనం చేయబడితే అతడు దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి.

  7. దానిని ఏ మృగమేదైనా చీల్చివేస్తే, సాక్ష్యంగా దాని మిగిలిన భాగాలను తీసుకురావాలి, చీల్చబడినదానికి నష్టపరిహారం అవసరం లేదు.

  8. “ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దు గాని గాడిద గాని తప్పిపోయి తిరుగుతూ నీకు కనబడితే, దానిని తప్పక తిరిగి అప్పగించాలి.

  9. “ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.

  10. “ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే, మీ పశువుల్లో మొదటి సంతానమైన ప్రతి మగపిల్ల అది దూడ గాని, గొర్రెపిల్ల గాని, అది నాకు చెందుతుంది.

  11. “నీవు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘పశువులదే గాని గొర్రెలదే గాని లేదా మేకలదే గాని క్రొవ్వును మీరు తినకూడదు.

  12. వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.

  13. “ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి.

  14. యెహోవా ఆజ్ఞాపించిన నియమానికి ఇది అవసరం: ఇశ్రాయేలీయులు లోపం లేని లేదా మచ్చలేని కాడి మోయని ఎర్రని పెయ్యను మీ దగ్గరకు తేవాలని చెప్పండి.

  15. మోయాబీయులు మిద్యాను పెద్దలతో, “ఈ దండు, ఒక ఎద్దు పొలం లోని గడ్డిని లాక్కున్నట్లు, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని లాక్కుంటుంది” అని అన్నారు. కాబట్టి ఆ సమయంలో మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు,

  16. ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి.

  17. కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు.

  18. మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”

  19. ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి అభివృద్ధి కలుగజేస్తారు. మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భఫలాన్ని, మీ భూఫలమైన మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువుల దూడలను, మందల గొర్రెపిల్లలను దీవిస్తారు.

  20. మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,

  21. జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు,

  22. మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.

  23. ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.

  24. మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.

  25. ఒక ఎద్దును ఒక గాడిదను జతచేసి దున్నకూడదు.