కంటెంట్‌కు వెళ్లండి

The Jews గురించి బైబిల్ వచనాలు

231 వచనాలు · 158 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు మోషే వారితో, “మీరు ఇలా చేస్తే అంటే మీరు యుద్ధం కోసం యెహోవా ఎదుట సిద్ధంగా ఉంటే,

  2. ఆయుధాలు ధరించిన మీరందరూ యొర్దాను దాటి యెహోవా తన శత్రువులను తన ఎదుట నుండి తరిమికొట్టే వరకు యొర్దానును దాటితే,

  3. దేశం యెహోవా ఎదుట వశపరచబడినప్పుడు, మీరు తిరిగివచ్చి యెహోవాకు, ఇశ్రాయేలుకు మీ బాధ్యత నుండి విముక్తి పొందవచ్చు. ఈ దేశం యెహోవా ఎదుట మీకు స్వాస్థ్యంగా ఉంటుంది.

  4. ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతిఒక్కరు తమ దృష్టికి సరియైనది అనుకున్న దానిని చేయకూడదు,

  5. ఎందుకంటే, ఇంకా మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న విశ్రాంతి స్థలానికి వారసత్వ దేశాన్ని చేరుకోలేదు.

  6. అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు.

  7. అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.

  8. మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత,

  9. వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి.

  10. వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.

  11. మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి దేశాల అసహ్యకరమైన మార్గాలను అనుకరించడం నేర్చుకోకండి.

  12. తమ కుమారున్ని లేదా కుమార్తెను అగ్నిలో బలి ఇచ్చే వారినైననూ, భవిష్యవాణి లేదా మంత్రవిద్య, శకునాలను చెప్పు వారినైననూ, మంత్రవిద్యలో నిమగ్నమయ్యేవారునూ మీలో ఎవరూ కనబడకూడదు.

  13. మంత్రాలు జపించేవారు గాని, ఆత్మలతో మాట్లాడేవారు గాని, చనిపోయినవారిని సంప్రదించేవారు గాని మీలో ఉండకూడదు.

  14. ఇలాంటివి అభ్యసించేవారు యెహోవాకు అసహ్యులు; ఇలాంటి హేయక్రియలు చేస్తారు కాబట్టే యెహోవా మీ ముందు నుండి జనాలను వెళ్లగొడుతున్నారు.

  15. మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి.

  16. మీరు స్వాధీనం చేసుకోబోయే జనులు మంత్రవిద్య లేదా భవిష్యవాణి పాటించేవారి మాట వింటారు. అయితే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలా అనుమతించలేదు.

  17. యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు.

  18. అది వృద్ధుల పట్ల గౌరవం గాని చిన్నవారి పట్ల జాలి గాని లేని క్రూరంగా కనిపించే దేశము.

  19. మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు.

  20. మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు.

  21. శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.

  22. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.

  23. ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”

  24. వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు.

  25. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము.