Skip to content

Self-Righteousness గురించి బైబిల్ వచనాలు

195 వచనాలు · 30 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు.

  2. ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా?

  3. “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?

  4. నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?

  5. యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు.

  6. దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.

  7. “నేను వింటుండగా నీవు మాట్లాడావు నీ మాటలు నేను విన్నాను.

  8. అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు; నేను శుద్ధుడను పాపం లేనివాడను.

  9. “ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’

  10. నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు, నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు?

  11. నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద, నీ నీతి ఇతరుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది.

  12. వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.

  13. “ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

  14. మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, కాని జ్ఞానులు సలహాలు వింటారు.

  15. ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.

  16. ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.

  17. తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు, కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?

  18. ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు, కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.

  19. బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు.

  20. తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు.

  21. తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.

  22. నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి.

  23. వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు.

  24. తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.

  25. తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.