Skip to content

Self-Righteousness గురించి బైబిల్ వచనాలు: General references

172 వచనాలు · 30 కోణాలు

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు.

  2. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టిన తర్వాత, “మా నీతిని బట్టే ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోవా మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చారు” అని మీ హృదయంలో అనుకోవద్దు. ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టబోతున్నారు.

  3. మీ నీతి, నిష్కపటమైన మీ హృదయం కారణంగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలేదు కాని ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడతారు.

  4. మీరు మొండి ప్రజలు కాబట్టి, మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోవడానికి ఈ మంచి దేశాన్ని మీకు ఇవ్వడానికి మీ నీతి కారణం కాదని మీరు గ్రహించండి.

  5. ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు;

  6. నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది.

  7. నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు.

  8. అయితే దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన నీతో వాదించాలని,

  9. జ్ఞాన రహస్యాలు ఆయనే నీకు తెలియజేయాలని నేను ఎంతో కోరుతున్నాను, ఎందుకంటే, నిజమైన జ్ఞానం నీ ఆలోచనకు మించింది. నీ పాపాల్లో కొన్నిటిని దేవుడు మరచిపోయారని తెలుసుకో.

  10. నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!

  11. అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.

  12. మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి; అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది.

  13. ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.

  14. ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి, నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు.

  15. ఎవరైనా నాపై ఆరోపణలు చేయగలరా? ఒకవేళ చేయగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను.

  16. అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి, నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి.

  17. భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు; నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.

  18. “నీవు ఈ మాటలు మాట్లాడడం ఎప్పుడు మానేస్తావు? కొంచెం ఆలోచించు, అప్పుడు మేము మాట్లాడతాము.

  19. నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?

  20. కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు, నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా? నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?

  21. “మీరేమి ఆలోచిస్తున్నారో, నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు.

  22. ‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు.

  23. ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా?

  24. “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?

  25. నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?