Skip to content

Samson గురించి బైబిల్ వచనాలు

59 వచనాలు · 12 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జోరహులో దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య గొడ్రాలు కాబట్టి ఆమెకు పిల్లలు లేరు.

  2. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.

  3. కాబట్టి నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకుండ జాగ్రతపడాలి, అపవిత్రమైనది ఏది తినకూడదు.

  4. నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.”

  5. అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది: “ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, అతడు దేవుని దూతలా చాలా భయం పుట్టించేవానిలా ఉన్నాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో నేను అడగలేదు, అతడు నాకు తన పేరు చెప్పలేదు.

  6. అయితే అతడు నాతో, ‘నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు, అపవిత్రమైనదేది తినకూడదు ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు.’ ”

  7. ఆ స్త్రీకి ఒక బాలుడు పుట్టగా అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించారు.

  8. అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.

  9. సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.

  10. అతడు తిరగి వచ్చి, తన తండ్రితో, తల్లితో, “నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీ యువతిని చూశాను; ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి” అని అన్నాడు.

  11. అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, “నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?” అన్నారు. కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది.”

  12. (ఇది యెహోవా నుండి వచ్చిందని, ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని అతని తల్లిదండ్రులకు తెలియదు; ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు.)

  13. సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్లాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటలను సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఒక కొదమసింహం గర్జిస్తూ అతనివైపు వచ్చింది.

  14. యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందుకు అతడు మేకపిల్లను చీల్చినట్టు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అయితే తాను చేసింది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు.

  15. తర్వాత సంసోను తిమ్నాతుకు వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు, ఆమెను ఇష్టపడ్డాడు.

  16. కొంతకాలం తర్వాత, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అతడు తిరిగి వెళ్లినప్పుడు, ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. ఆ కళేబరంలో తేనెటీగ గుంపును, కొంచెం తేనెను అతడు చూశాడు.

  17. అతడు కొంచెం తేనెను చేతుల్లోకి తీసుకుని తింటూ ముందుకు వెళ్లాడు. అతడు తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నప్పుడు, వారికి కొంచెం ఇచ్చాడు, వారు కూడా తిన్నారు. అయితే సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు.

  18. అతని తండ్రి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, పెళ్ళికుమారుడు అలా చేయడం అక్కడి ఆనవాయితి.

  19. ప్రజలు అతన్ని చూడగానే వారు అతనికి తోడుగా ఉండడానికి ముప్పైమంది యువకులను తీసుకువచ్చారు.

  20. సంసోను వారితో అన్నాడు, “మీకు ఒక పొడవు కథ చెప్తాను, ఈ విందు జరిగే ఏడు రోజుల్లో మీరు దాని జవాబు చెప్తే, ముప్పై సన్నని నారబట్టలు, ముప్పై జతల దుస్తులు ఇస్తాను.

  21. ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతే, ముప్పై సన్నటి నారబట్టలు, ముప్పై జతల దుస్తులు మీరు నాకు ఇవ్వాలి.” వారు అన్నారు, “నీ పొడుపు కథ చెప్పు, మేము వింటాము.”

  22. అందుకు అతడు అన్నాడు, “తినే దానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.” మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు.

  23. నాల్గవ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, “ఆ పొడుపు కథ అర్థమేమిటో మాకు చెప్పమని నీ భర్తను ఒప్పించు లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివారిని దహించి వేస్తాము. మా స్వాస్థ్యాన్ని కాజేయడానికి మమ్మల్ని ఆహ్వానించారా?”

  24. అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”

  25. విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.