Samson గురించి బైబిల్ వచనాలు: Is avenged for the estrangement of his wife
Is avenged for the estrangement of his wife గురించి వచనాలు
అప్పుడు సంసోను, “నేను ఇప్పుడు ఫిలిష్తీయులకు ఏదైనా కీడు చేసినా నిర్దోషినే” అని,
సంసోను బయటకు వెళ్లి మూడువందల నక్కలను పట్టుకుని, రెండేసి నక్కల తోకలను ఒకదానికొకటి ముడివేసి ఆ రెండు తోకల మధ్య ఒక దివిటీని కట్టి,
ఆ దివిటీలను వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ పంట చేలల్లోకి ఆ నక్కలను వదిలాడు. ఇలా అతడు పనల కుప్పలను పైరును ద్రాక్ష ఒలీవ తోటలను తగలబెట్టాడు.
ఫిలిష్తీయులు, “ఇలా ఎవరు చేశారు?” అని అడిగినప్పుడు, “తిమ్నా అల్లుడైన సంసోను; తన భార్యను తన స్నేహితునికి ఇచ్చినందుకు అలా చేశాడు” అని చెప్పారు. అందుకు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని కాల్చి చంపారు.
అప్పుడు సంసోను వారితో, “మీరిలా చేశారు కాబట్టి మీమీద పగతీర్చుకునే వరకు నేను ఊరుకోను” అంటూ,
అతడు వారిపై దాడి చేసి తొడలనూ తుంటి ఎముకలను విరగ్గొట్టి వారిలో చాలామందిని చంపేశాడు. తర్వాత అతడు వెళ్లి, ఏతాము బండ సందులో నివసించాడు.