Skip to content

Righteousness గురించి బైబిల్ వచనాలు

480 వచనాలు · 132 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు.

  2. బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు.

  3. అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు.

  4. అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు.

  5. పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, “బోధకుడా, మేము ఏమి చేయాలి?” అని అడిగారు.

  6. అందుకు అతడు వారితో, “మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని చెప్పాడు.

  7. తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు.

  8. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.

  9. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా?

  10. తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఇతరులను చిన్న చూపు చూసేవారితో యేసు ఈ ఉపమానం చెప్పారు:

  11. “అయితే సత్యాన్ని అనుసరించి జీవించేవారు తాము చేసినవి దేవుని దృష్టి ఎదుట చేసినవి కాబట్టి అవి స్పష్టంగా కనబడేలా వెలుగులోనికి వస్తారు” అని చెప్పారు.

  12. ఆయన సాక్ష్యాన్ని అంగీకరించేవారు దేవుడు సత్యవంతుడని ధ్రువీకరిస్తారు.

  13. దేవునికి చెందినవారు దేవుడు చెప్పే మాటలు వింటారు. మీరు దేవునికి చెందినవారు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు” అని అన్నారు.

  14. యేసు, “నేను దయ్యం పట్టినవాడను కాను. నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు.

  15. మీరు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటే, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు” అన్నారు.

  16. నా ఆజ్ఞలను పాటించేవారు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడ వారిని ప్రేమించి నన్ను నేను వారికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నారు.

  17. యూదా ఇస్కరియోతు కాదు, మరొక యూదా యేసుతో, “కానీ ప్రభువా, నీవు ఈ లోకానికి కాకుండా మాకే ఎందుకు కనుపరచుకోవాలని అనుకుంటున్నావు?” అని అడిగాడు.

  18. అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము.

  19. నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు.

  20. నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.

  21. “నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు.

  22. మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.

  23. నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి.

  24. యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థము. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది.

  25. కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.